newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

గూగుల్ పిక్సల్ 4ఏ, పిక్సెల్ 5 మొబైల్స్.. 5జీ కూడా సొంతం..!

01-10-202001-10-2020 14:32:53 IST
Updated On 01-10-2020 14:40:18 ISTUpdated On 01-10-20202020-10-01T09:02:53.102Z01-10-2020 2020-10-01T09:02:48.702Z - 2020-10-01T09:10:18.898Z - 01-10-2020

గూగుల్ పిక్సల్ 4ఏ, పిక్సెల్ 5 మొబైల్స్.. 5జీ కూడా సొంతం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గూగుల్ సంస్థ రెండు మొబైల్ ఫోన్స్ ను తాజాగా తీసుకుని వచ్చింది. పిక్సల్ 4ఏలో 5జీ వర్షన్ ను, పిక్సెల్ 5 పేరిట రెండు వేరియంట్లను సంస్థ విడుదల చేసింది. స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ తో పాటూ దీనికి రక్షణగా టైటాన్ ఎం సెక్యూరిటీ చిప్ ఉంటుందని సంస్థ తెలిపింది. గూగుల్ పిక్సెల్ 5 ను 2020లో ఫ్లాగ్ షిప్ ఫోన్ గా గూగుల్ చెబుతోంది. పిక్సల్ 4ఏ, పిక్సెల్ 5  రెండు మొబైల్స్ లో కూడా డ్యూయల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది. అలాగే హోల్ పంచ్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్స్ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ను ఈ మొబైల్స్ లో తీసుకుని వచ్చారు. దీని ద్వారా బ్యాటరీ లైఫ్ 48 గంటల వరకు పెంచవచ్చు. అలాగే పోట్రైట్ లైట్ ఫీచర్ కూడా ఉంది. పిక్సెల్ 5 లో వైర్ లెస్ ఛార్జింగ్ కలదు. అల్యూమినం బాడీతో ఐపీ68 సర్టిఫైడ్ తో  డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కెపాసిటీ ఉంది.  

ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్: 

గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ:   

డ్యూయల్ సిమ్ (నాన్ ప్లస్ ఈ-సిమ్), ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ హెచ్డీ 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 6 జీబీ రామ్ ఉంటాయి. డ్యూయల్ రేర్ కెమెరాలు (16 ఎంపీ / 12.2 ఎంపీ), ఫంట్ కెమెరా 8 ఎంపీ ఉంటాయి. వీటితో 4కే వీడియోలను కూడా తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ / ఏజీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ సదుపాయాలుంటాయి. యాక్సిలెరోమీటర్, బారోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నిటో మీటర్, స్టీరియో స్పీకర్స్, రెండు మైక్రోఫోన్ లుంటాయి. 3,885 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే దీని బరువు కేవలం 168 గ్రాములు.  

గూగుల్ పిక్సెస్ 4ఏ 5జీ ధర 499 డాలర్లు (సుమారు రూ. 37 వేలు)

గూగుల్ పిక్సెల్ 5: 

డ్యూయల్ సిమ్ (నాన్ ప్లస్ ఈ-సిమ్), ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ హెచ్డీ 6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 8 జీబీ రామ్ ఉంటాయి. డ్యూయల్ రేర్ కెమెరాలు (12.2 ఎంపీ / 8 ఎంపీ), ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ ఉంటాయి. వీటితో 4కే వీడియోలను కూడా తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ / ఏజీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సదుపాయాలుంటాయి. యాక్సిలెరోమీటర్, బారోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్, మూడు మైక్రోఫోన్ లుంటాయి. 4,080 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే దీని బరువు కేవలం 151 గ్రాములు మాత్రమే.

గూగుల్ పిక్సెల్ 5 ధర 699 డాలర్లు (సుమారు రూ. 51,400)

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle