newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఆ మొబైల్ ఫోన్ల లో గూగుల్ పే పని చేయడం లేదు..!

22-10-202022-10-2020 16:18:58 IST
Updated On 22-10-2020 16:33:39 ISTUpdated On 22-10-20202020-10-22T10:48:58.350Z22-10-2020 2020-10-22T10:48:53.839Z - 2020-10-22T11:03:39.687Z - 22-10-2020

ఆ మొబైల్ ఫోన్ల లో గూగుల్ పే పని చేయడం లేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గూగుల్ పే.. డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకోడానికి పలువురు ఉపయోగించే యాప్ ఇది. అయితే కొన్ని మొబైల్ ఫోన్లలో గూగుల్ పే పనిచేయడం లేదంటూ కథనాలు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా హ్యాండ్ సెట్స్ లో గూగుల్ పే యాప్ పని చేయడం లేదట. గత కొద్ది నెలలుగా ఆ యాప్ ను వాడుతుంటే సమస్యలు వస్తున్నాయని, సరిగా పనిచేయడం లేదని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. కొన్ని శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఫోన్ల విషయంలోనే ఈ సమస్యలు వచ్చాయని.. మిగిలిన మొబైల్ ఫోన్లలో ఎటువంటి సమస్యలు తలెత్తలేదని నిపుణులు స్పష్టం చేశారు. సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా మొబైల్ ను ఆగష్టు నెలలో లాంఛ్ చేసింది. 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా మొబైల్ ఫోన్ లో గూగుల్ పే ద్వారా ఎన్.ఎఫ్.సి. పేమెంట్లు చేస్తూ ఉండగా తమకు టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా మొబైల్ ఫోన్ లో గూగుల్ పే ద్వారా ఎన్.ఎఫ్.సి. పేమెంట్లు చేస్తుంటే ఒక్కసారిగా యాప్ పనిచేయడం ఆగిపోతోందని.. ఎరుపు రంగు ఆశ్చర్యార్థకం సింబల్ ను చూపిస్తోందని చెబుతూ ఉన్నారు.. 'ఎర్రర్' మెసేజీ కూడా వస్తోందని వెల్లడించారు. ఇక మిగతా సమయాల్లో గూగుల్ పే బాగా పని చేస్తోందని అంటున్నారు. డీఫాల్ట్ పేమెంట్ ప్రొవైడర్ గా పెట్టుకున్నప్పటికీ కూడా ఎన్.ఎఫ్.సి. పేమెంట్ చేయాలని అనుకున్నప్పుడు వీలు పడడం లేదని చెబుతూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యలు తలెత్తడం లేదని తెలుస్తోంది.       

సిమ్ కార్డు స్లాట్ ను మార్చడం ద్వారా సమస్య పరిష్కారం అయిందని కొందరు చెబుతూ ఉంటే.. మరి కొందరేమో ఓటిఏ అప్ డేట్ చేయడం ద్వారా ఇప్పుడు అంతా సర్దుకుందని చెబుతూ ఉన్నారు. తాము ఏమి చేసినా సమస్య మాత్రం పరిష్కారమవ్వలేదని.. మరికొందరు యూజర్లు చెప్పుకొచ్చారు. దీనిపై శాంసంగ్ సంస్థ ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle