గూగుల్ పే వాడితే డబ్బులు గోవిందా
08-10-202008-10-2020 14:03:41 IST
2020-10-08T08:33:41.704Z08-10-2020 2020-10-08T08:33:35.191Z - - 20-01-2021

గూగుల్ పే వాడే వాళ్ల సంఖ్య లెక్కల్లోకి పోతే కోట్లల్లోనే ఉంటరు. ఊళ్లల్లో ఉన్న చదువురాని వాళ్లు కూడా గూగుల్ పే ని ఈజీగా వాడేస్తున్నారు. ఎవరో ఒకరితో అకౌంట్ లింక్ చేయించుకుని ట్రాన్స్ ఫర్లు చేస్తూ ఈజీ పే కి అలవాటయ్యారు. దీన్నే ఛాన్స్ గా తీసుకున్న నేరగాళ్లు వాళ్ల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద అమౌంట్లు వచ్చేలా చేసి డబ్బులు కాజేస్తున్నారు. మామూలుగా అయితే గూగుల్ పే (GPay) లో లిమిటెడ్ మనీ ట్రాన్స్ ఫర్ చేయగానే ఓ రివార్డ్ వస్తుంది. అది క్లియర్ గా తెలిసిపోతుంది. అకౌంట్ యూజర్లు కూడా ఆశగా కళ్లన్నీ పెద్దవి చేసుకుని ఓపెన్ చేస్తారు. వెంటనే ఓ పది పది హేను వేలు పాతిక వేలు కనిపిస్తయ్. దాన్ని స్క్రాచ్ చేయగానే చూసి ఆనంద పడిపోతాం. వెంటనే అది వేరే లింక్ కి కి వెళ్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనీ అకౌంట్ లో పడుతున్నట్లు చూపిస్తుంది. కానీ. ఇలా వేరే లింక్ ఓపెన్ అయ్యింది అంటే మీ డబ్బులు గోవిందా అని అర్దం. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మీ అకౌంట్ లో నుంచి తట్టా బుట్టా సర్దుకుని ఫేక్ గాళ్ల అకౌంట్ లోకి వెళ్తుంది. గూగుల్ పే లో రివార్డ్ వస్తే మన ఫోన్ కి మెస్సేజ్ రాదు. వాట్సాప్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. మెయిల్ కి కూడా ఎలాంటి డీటెయిల్స్ రావు. కేవలం గూగుల్ పే లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే స్క్రాచ్ చేయగానే మనీ మన అకౌంట్ లోకి యాడ్ అయిపోతుంది. లేదంటే ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. అంతే కానీ.. ఎలాంటి లింకూ ఓపెన్ కాదు. లింక్ ఓపెన్ అయిందంటే మీ మనీ వాళ్ల అకౌంట్ కి సింకులో ఉన్నట్లే. సో ఏ లింకు ఓపెన్ అయినా అమౌంట్ కాస్త టెమ్ట్ చేసినా నొక్కొద్దు. ఇంకో విషయం ఏంటంటే గూగుల్ పే పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చే రోజులు పోయినయ్. పదో పరకో ఇస్తోంది. ఎక్కువగా 5 రూపాయలు లేదంటే ఓ 15 రూపాయలు మరీ ఘనం అనుకుంటే ఓ వంద అంతకు మించి ఇవ్వడం లేదు. యూజర్ల కళ్లల్లో ఆనందం చూడ్డానికి వాళ్లిచ్చే చిల్లర అమౌంట్ ని చూసి మురిసిపోతే ఓకే. పెద్ద అమౌంట్ వచ్చింది కదా అని కళ్లు మూసుకుని లింక్ ని ఓపెన్ చేస్తే కన్నీళ్లు తప్పవు. కాస్త చూస్కోండీ.

వాట్సప్ కు భారత్ వార్నింగ్
16 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా