ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?
24-11-202024-11-2020 09:35:57 IST
Updated On 24-11-2020 10:17:30 ISTUpdated On 24-11-20202020-11-24T04:05:57.785Z24-11-2020 2020-11-24T04:05:49.458Z - 2020-11-24T04:47:30.040Z - 24-11-2020

ట్రూ కాలర్.. ఏదైనా ఫోన్ నెంబర్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. భారత్ లో ఈ యాప్ ను బాగా వాడుతూ ఉన్నారు. గూగుల్ సంస్థ ఇలాంటి ఓ యాప్ మీద తాజాగా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. గూగుల్ దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఓ యూట్యూబ్ వీడియోలో 'గూగుల్ కాల్' అనే యాప్ కనిపించింది. గూగుల్ కాల్ యాప్ ద్వారా కాలర్ ఐడీ, ట్రూ కాలర్ లో ఉండే ఫీచర్లను వాడొచ్చని చెబుతూ ఉన్నారు. గూగుల్ కాలర్ ఐడీ యాప్ ఇదేనని అప్పుడే ప్రచారం జరుగుతోంది. ఓ రెడ్డిట్ యూజర్ అప్లోడ్ చేసిన స్క్రీన్ షాట్ ద్వారా గూగుల్ కాల్ యాప్ ప్రయోగ దశలో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. “Know who’s calling. Reliable called ID lets you answer with confidence,” అంటూ మెసేజీ కూడా ఉండడంతో ఈ ఫీచర్ త్వరలోనే రాబోతోందని స్పష్టమవుతోంది. గూగుల్ కాల్ యాప్ కు ఫోన్ ఐకాన్ ఉంది.. గూగుల్ ప్లే స్టోర్ లో అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే యూట్యూబ్ లో యాడ్ రావడం ద్వారా త్వరలోనే ఈ ఫీచర్ ను తీసుకుని రాబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాలర్ ఐడీ తెలపడంతో ట్రూకాలర్ తో పోటీ పడబోతోంది గూగుల్. ట్రూకాలర్ కంటే అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021

వెనక్కు తగ్గిన వాట్సాప్
12-01-2021

కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్
11-01-2021

ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్
08-01-2021

పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!
06-01-2021

5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్
04-01-2021
ఇంకా