newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ మీట్.. 24 గంటల పాటూ మీటింగ్ పెట్టుకోవచ్చు

30-09-202030-09-2020 14:00:37 IST
Updated On 30-09-2020 14:20:35 ISTUpdated On 30-09-20202020-09-30T08:30:37.296Z30-09-2020 2020-09-30T08:30:33.550Z - 2020-09-30T08:50:35.487Z - 30-09-2020

గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ మీట్.. 24 గంటల పాటూ మీటింగ్ పెట్టుకోవచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇన్ని రోజులూ ఉచితంగా గూగుల్ మీట్ సేవలు అందుబాటులోకి రాగా..  సెప్టెంబరు 30 తేదీ నుంచి గూగుల్ నిలిపివేయాలనుకుంటుందని ది వెర్జ్‌ అనే టెక్‌ వార్తా సంస్థ కథనం బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే..!  ఒక మీట్ కాల్‌ను కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడగలరు. ఇక మీదట అపరిమిత కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉండదని కథనాలు వచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్‌, ఆన్‌లైన్‌ క్లాసులతో ఎంతో మందికి చేరువైన‌ గూగుల్ మీట్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు గూగుల్ మే నెలలో ప్రకటించింది. తాజాగా మీట్ ఉచిత సేవలను సెప్టెంబరు 30 తేదీ నుంచి గూగుల్ నిలిపివేయాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గూగుల్ సంస్థ ఆ నిర్ణయాన్ని  ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

మార్చి 31, 2021 వరకూ గూగుల్ సంస్థ మీట్ వీడియో కాల్స్ ను ఉచితంగానే అందించనుంది. 24 గంటలు వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉంది.  సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉన్న డెడ్ లైన్ ను వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించింది. కరోనా వైరస్ లాక్ డౌన్  సమయంలో గూగుల్ మీట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వర్చువల్ మీటింగ్ లకు గూగుల్ మీట్ బాగా ఉపయోగపడింది. తమ సంస్థ అందిస్తున్న ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగపడుతోందని.. ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగించాలని అనుకుంటూ ఉన్నామని తెలిపింది. 

గూగుల్ మీట్ లో ఇటీవలే కొన్ని సరికొత్త ఫీచర్లను తీసుకుని వచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాగ్రౌండ్ బ్లర్, 49 మంది స్క్రీన్స్ ను షేర్ చేసుకునే విధంగా గ్రిడ్ వ్యూ. క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉండేలా అప్డేట్స్ ను తీసుకుని వచ్చారు. ఈ ఏడాది జులైలో గూగుల్ ప్లేను 100 మిలియన్ల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. బిజినెస్ యూజర్లు ఎలాంటి సదుపాయాలను ఎంజాయ్ చేస్తున్నారో.. ఫ్రీ యూజర్లు కూడా అలాంటి ఫీచర్లనే వాడుకోవచ్చని గూగుల్ సంస్థ తెలిపింది. 

 ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

   16 hours ago


19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

   17 hours ago


 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

   19 hours ago


2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

   18-10-2020


మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

   17-10-2020


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

   17-10-2020


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

   17-10-2020


ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు భారత్ లో కూడా అందుబాటులో..!

ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు భారత్ లో కూడా అందుబాటులో..!

   16-10-2020


బోర్డ‌ర్ గొడ‌వ‌ల‌కీ చైనా ఫోన్ కీ లింకు..?

బోర్డ‌ర్ గొడ‌వ‌ల‌కీ చైనా ఫోన్ కీ లింకు..?

   16-10-2020


ఐఫోన్ ను ట్రోల్ చేసిన శాంసంగ్.. ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వకపోవడమేంటండి

ఐఫోన్ ను ట్రోల్ చేసిన శాంసంగ్.. ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వకపోవడమేంటండి

   16-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle