newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఫ్లిప్ కార్ట్.. ఈ పొరపాటు ఏంటమ్మా..!

10-10-202010-10-2020 10:19:27 IST
Updated On 10-10-2020 10:24:17 ISTUpdated On 10-10-20202020-10-10T04:49:27.627Z10-10-2020 2020-10-10T04:48:51.211Z - 2020-10-10T04:54:17.886Z - 10-10-2020

ఫ్లిప్ కార్ట్.. ఈ పొరపాటు ఏంటమ్మా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రముఖ ఆన్ లైన్ విక్రయాల సంస్థ ఫ్లిప్ కార్ట్ లో పలు వస్తువులను ఎప్పుడూ అమ్మకానికి పెడుతూ ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. తాజాగా నాగాలాండ్ కు చెందిన ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఏదో సమాధానం చెప్పబోయి  ఊహించని విధంగా పొరపాటు చేసింది. నాగాలాండ్ భారత్ లో ఓ భాగమే కాదంటూ ఫ్లిప్ కార్ట్ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం చెలరేగింది. భారతదేశం బయట ఉన్న ప్రాంతాలకు తాము వస్తువులను డెలివరీ చేయమని చెప్పడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.  

నాగాలాండ్ కు ఎందుకు వస్తువులు డెలివరీ చేయడంలేదని ఓ వినియోగదారుడు ఫ్లిప్ కార్ట్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. ఫ్లిప్ కార్ట్ బదులిస్తూ... అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. మా వద్ద షాపింగ్ చేయాలన్న మీ ఆసక్తిని అభినందిస్తున్నాం. అమ్మకందారులు మా సేవలను భారతదేశం వెలుపల అందించడం లేదు అని చెప్పింది. నాగాలాండ్ భారత భూభాగమేనన్న విషయంపై అవగాహన లేకుండా ట్వీట్ చేసిన ఫ్లిప్ కార్ట్ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు తెలుసుకున్న ఫ్లిప్ కార్ట్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తాము పొరబాటు చేశామని అంగీకరించి క్షమాపణలు తెలిపింది. నాగాలాండ్ లోని ప్రాంతాలతో సహా దేశం మొత్తం తమ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలపడంతో నెటిజన్లు శాంతించారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle