newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ కు ముహూర్తం ఖరారు..!

24-10-202024-10-2020 14:56:05 IST
Updated On 24-10-2020 15:58:12 ISTUpdated On 24-10-20202020-10-24T09:26:05.740Z24-10-2020 2020-10-24T09:25:58.751Z - 2020-10-24T10:28:12.879Z - 24-10-2020

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ కు ముహూర్తం ఖరారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ మధ్యనే పూర్తయిన సంగతి తెలిసిందే..! 'ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్' త్వరలోనే మొదలు కాబోతోంది. అక్టోబర్ 29 నుండి నవంబర్ 4వ తేదీ వరకూ ఈ సేల్ జరగనుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ను అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 21 వరకూ నిర్వహించింది ఫ్లిప్ కార్ట్. బిగ్ బిలియన్ డేస్ సేల్ లాగే  ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ కూడా ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు కొంచెం తొందరగా మొదలు కానుంది. పలు బ్యాంకుల కార్డులపై ఈ సేల్ సమయంలో ఆఫర్లు లభించనున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ తో పాటూ భారీ డిస్కౌంట్లు అందించనున్నారు. బిగ్ బిలియన్ డేస్ సమయంలో ఆఫర్లను మిస్ అయిన వాళ్లు ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ సమయంలో తమకు కావాల్సిన, నచ్చిన వస్తువులను కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు. 

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ వారం రోజుల పాటూ జరగనుంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల విషయంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ సమయంలో భారీ ఆఫర్లు లభించనున్నాయి. Samsung Galaxy F41, Samsung Galaxy S20+, Samsung Galaxy A50s మొదలైన ఫోన్లు తక్కువ ధరకే లభించనున్నాయి.  Poco M2, Poco M2 Pro, Poco C3, Oppo Reno 2F, Oppo A52, Oppo F15, Realme Narzo 20 సిరీస్ మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. 

వినియోగదారులకు మొబైల్ యాక్సెసరీస్, కెమెరాలు, ల్యాప్ టాప్, స్మార్ట్ వాచెస్, హెడ్ ఫోన్స్.. మరిన్ని వస్తువులపై 80శాతం పైగా ఆఫర్లు లభించనున్నాయి. ల్యాప్ టాప్ ల మీద కూడా 50 శాతం డిస్కౌంట్ లభించనున్నాయి. ట్యాబ్లెట్స్ మీద 45 శాతం వరకూ డిస్కౌంట్ ఉండగా.. స్పీకర్ల మీద 80 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుంది. మరిన్ని ఆఫర్ల కోసం ఫ్లిప్ కార్ట్ సైట్ లోకి వెళ్ళండి.  


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle