newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కు ముహూర్తం ఖరారు..!

03-10-202003-10-2020 16:04:48 IST
Updated On 03-10-2020 16:25:42 ISTUpdated On 03-10-20202020-10-03T10:34:48.241Z03-10-2020 2020-10-03T10:34:42.515Z - 2020-10-03T10:55:42.634Z - 03-10-2020

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కు ముహూర్తం ఖరారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2020 కు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 16 నుండి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ ను మొదలుపెట్టనున్నారు. ఎన్నో ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లతో సాగే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 21 వరకూ సాగనుంది. ఫ్లిప్ కార్ట్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈ బిగ్ బిలియన్ డేస్ కోసం జట్టు కట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్ ను కొంటే 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ కస్టమర్లు అక్టోబర్ 15నే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ డీల్స్ ను చూసుకోవచ్చు. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుల మీదనే కాకుండా.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డులకు కూడా ఇచ్చింది. అలాగే పలు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఈఎంఐలో వస్తువులను కొనుక్కోవచ్చు. పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ తో కొనుక్కునా కూడా క్యాష్ బ్యాక్ వస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

బిగ్ బిలియన్ డేస్ అంటేనే బ్రాండెడ్ వస్తువుల సెలెబ్రేషన్ అని.. ఎన్నడూ చూడని బ్రాండ్స్ తో ఈసారి బిగ్ బిలియన్ డేస్ ను తీసుకుని వచ్చామని.. ముఖ్యంగా రాబోయే పండుగల కోసం షాపింగ్ లు చేసుకోవడం కోసం ఆఫర్లను తీసుకుని వస్తున్నామని ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సిఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. 

బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా మొబైల్ ఫోన్స్, టీవీలు, అలాగే ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ మీద కూడా భారీగా డిస్కౌంట్లను తీసుకుని వస్తోంది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సమయంలో అమ్మే వస్తువులపై వెబ్సైట్ లో పలు ప్రొడక్ట్స్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందుపరిచింది.   

కిరాణా సరుకుల విషయంలో కూడా ఫ్లిప్ కార్ట్ ప్రజల్లోకి మరింత దూసుకుని వెళ్లాలని భావిస్తోంది. 50000కు పైగా కిరాణా స్టోర్స్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. లాస్ట్-మైల్ డెలివరీస్ లో భాగంగా 850 నగరాల్లో ఇ-రిటైలర్లుగా వ్యవహరించనున్నారు. 

ఫ్లిప్ కార్ట్ తో పోటీలో భాగంగా అమెజాన్ కూడా పండుగల సీజన్ లో పెద్ద ఎత్తున సేల్స్ ను నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగానే 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' ను అమెజాన్ తీసుకుని వస్తోంది. అమెజాన్ ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేట్స్ ను అనౌన్స్ చేయలేదు.    


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle