50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లను అమ్మేసిన ఫేస్ బుక్
27-01-202127-01-2021 14:35:32 IST
2021-01-27T09:05:32.997Z27-01-2021 2021-01-27T09:05:28.937Z - - 09-03-2021

ఫేస్ బుక్ యూజర్లకు సంబంధించిన 50 కోట్ల మొబైల్ ఫోన్ నంబర్లను అమ్మకానికి పెట్టేసినట్లు వార్తలు గుప్పుమనడంతో ప్రపంచవ్యావ్తంగా యూజర్లు వణికిపోతున్నారు. వీరిలో 9 లక్షలమంది భారతీయ యూజర్ల ఫోన్లు కూడా ఉన్నాయని సమాచారం.
ఫేస్ బుక్ నిర్వాకం గురించి మొదటగా ట్విట్టర్ ఖాతాలో ఎత్తి చూపిన సెక్యూరిటీ రీసెర్చర్ అలోన్ గాల్ కళ్లు తిరిగే వాస్తవాన్ని వెల్లడించారు. యూజర్లు వాడే టెలిగ్రామ్ బోట్ ద్వారా ఫేస్ బుక్ 50 కోట్ల మంది మొబైల్ నంబర్లను అంగట్లో అమ్మకానికి పెట్టేసిందని గాల్ చెప్పారు. అన్నిదేశాల్లో ఉండే ఫేస్ బుక్ వినియోగదారుల మొబైల్ ఫోన్లను ఎవరైనా చూడవచ్చు అనే దాన్ని ప్రాతిపదికగా చేసుకుని యూజర్ల అకౌంట్ డేటా బేస్‌ని ఫేస్ బుక్ కొల్లగొట్టిందని గాల్ చెప్పాడు.
ఫేస్బుక్ వాడకందారుల ఫోన్ నంబర్లు టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెడుతున్నారని ఒక సెక్యూరిటీ అధ్యయనం వెల్లడించింది. ఫేస్బుక్ ఐడీలకు చెందిన ఫోన్ నంబర్లను టెలిగ్రామ్ ఆటోమేటెడ్ బోట్‌ను వినియోగించి ఒక సైబర్ క్రిమినల్ సంస్థ సేకరించి సదరు డేటాను విక్రయిస్తోందని అధ్యయనం తెలిపింది.
2020లో ఈ సెక్యూరిటీ క్రైమ్ గురించి తొలిసారి తెలిసిందని, వివరంగా పరిశీలిస్తే వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం తస్కరణకు గురైనట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేశారు. ఈ బోట్ 2021 జనవరి వరకు యాక్టివ్గానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
ఇదే అంశాన్ని మదర్బోర్డ్ నివేదిక ధృవీకరిస్తూ, టెలిగ్రామ్ బోట్ ద్వారా ఈ వివరాలు తస్కరించారని తెలిపింది. ఒక్క యూజర్ వివరం కావాలంటే 20 డాలర్లు, పెద్ద ఎత్తున కావాలంటే 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు చెల్లించాలని తెలిపింది. ఇప్పటికైనా ఫేస్బుక్ తన యూజర్లను ఈ విషయమై హెచ్చరించాలని సూచించింది.
వివిధ దేశాల్లో నానా రకాల వివాదాలతో ఇబ్బందులు పడుతున్న ఆన్లైన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాద సుడిగుండంలో ఇరుక్కుంటోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఓలా ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ.. ఏడాదిలో కోటి యూనిట్ల తయారీ
12 hours ago

ట్వీట్ లో తప్పులకు చెక్ పెట్టొచ్చా..?
06-03-2021

మంచి నిర్ణయం తీసుకున్న రిలయన్స్ సంస్థ.. పలు టెక్ దిగ్గజాలు కూడా..!
05-03-2021

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్‌గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021
ఇంకా