newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

11-07-202111-07-2021 09:03:34 IST
2021-07-11T03:33:34.256Z11-07-2021 2021-07-11T03:33:27.166Z - - 21-09-2021

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
90వ దశకంలో స్కూటర్‌ విభాగంలో బజాజ్ చేతక్‌ ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అప్పట్లో టీవీలలో 'హమారా బజాజ్' అని వచ్చే యాడ్ అందరినీ విశేషంగా ఆకట్టుకునేది. అయితే బైకుల అమ్మకాలు పెరగడంతో చేతక్‌ స్కూటర్‌ అమ్మకాలు క్రమంగా పడిపోయాయి. 

ప్రస్తుతం బజాజ్‌ చేతక్‌ ఈ-స్కూటర్ లని మార్కెట్ లోకి తీసుకువస్తోంది. అయితే ఈ-స్కూటర్ లు ఇంకా మార్కెట్ లోకి రాకముందే ఆన్ లైన్ రిజిష్ట్రేషన్ ద్వారా స్కూటర్ లన్నీ అమ్ముడుపోయాయని బజాజ్ సంస్థ ప్రకటించింది. ఒక విధంగా ఇది సంచలనమే అని చెప్పుకోవాలి.

కాగా ఈ బజాజ్ ఈ-స్కూటర్ లు అర్బన్‌, ప్రీమియం వేరియంట్లలో లభిస్తోంది. షోరూమ్‌ ప్రకారం అర్బన్‌ ధర రూ. 1.42,620 ఉండగా ప్రీమియం ధర రూ. 1,44,620గా ఉంది.  ఇందులో 2 కిలోవీట్‌ బ్యాటరీలు అమర్చారు.బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీ అందిస్తున్నారు.ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. హైదరాబాద్‌లో తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రవేశ పెట్టేందుకు బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సిద్ధమైంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో చేతక్‌ ఈవీ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నాగ్‌పూర్‌ తర్వాత చెన్నై, హైదరాబాద్‌లలో తమ స్కూటర్‌ తెచ్చేలా బజాజ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

   a day ago


హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

   19-09-2021


కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

   14-09-2021


బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

   07-09-2021


అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

   02-09-2021


మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

   25-08-2021


గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

   24-08-2021


త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

   22-08-2021


స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

   20-08-2021


కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

   19-08-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle