newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్

08-01-202108-01-2021 08:47:25 IST
2021-01-08T03:17:25.128Z08-01-2021 2021-01-08T03:17:20.538Z - - 17-01-2021

ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మారారు. తొలి స్థానంలో ఉన్న అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ను దాటి ఎలాన్ మాస్క్ ముందుకు వెళ్ళాడు. ఎలాన్‌ మస్క్‌ కేవలం కార్ల సంస్థనే కాకుండా స్పేస్‌ ఎక్స్‌ పేరుతో రాకెట్ల తయారీ సంస్థతో పాటు, న్యూరాలింక్‌ అనే మరో సంస్థను కూడా స్థాపించారు. ఎప్పటికప్పుడు ఎలాన్ మస్క్ సంస్థల పేర్లు ప్రపంచంలో వినిపిస్తూనే వచ్చాయి. ఎలాన్ మస్క్ కొత్త కారు.. ఎలాన్ మస్క్ రాకెట్ లాంఛింగ్.. ఇలా చాలా విషయాల్లో మస్క్ పాపులారిటీ సంపాదించుకుంటూ వెళ్ళాడు. అలాగే అతడి సంస్థ కూడా ఎదుగుతూ వెళ్ళింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ఆధారంగా గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం.. ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ ఏకంగా 188.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ సంపదతో పోలీస్తే 1.5 బిలియన్‌ డాలర్లు అధికం. గతేడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న మస్క్‌ ఏడాది కాలంలోనే మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. 2020 నవంబర్‌ చివరిలో ఎలాన్‌ మస్క్‌ మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవగా, ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే మొదటి స్థానానికి చేరారు. 

గురువారం నాడు టెస్లా సంస్థ ఈక్విటీ విలువ స్టాక్ మార్కెట్ లో 4.8 శాతం పెరగడంతో ఆయన ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయిందని బ్లూమ్ బర్గ్  తెలియజేసింది. మస్క్ ఆస్తుల విలువ 188.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. గడచిన ఏడాది వ్యవధిలో మస్క్ ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది. ఆయన ఆస్తుల విలువ గత సంవత్సరం ఏకంగా 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న భవిష్యత్, దీన్ని ముందుగానే గుర్తించి మరింత మైలేజ్, వేగాన్ని అందించే కార్లను టెస్లా తయారు చేస్తోంది. ఏడాది వ్యవధిలో టెస్లా కంపెనీ ఈక్విటీ ధర 734 శాతం పెరిగింది. నవంబర్ తరువాత పరిస్థితులు టెస్లాకు అనుకూలంగా మారాయి. డెమోక్రాట్లు జార్జియా సెనెట్ సీట్లను సొంతం చేసుకోవడం, బైడెన్ అధికారంలోకి రావడంతో సాధ్యమైనంత త్వరగా పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను రీప్లేస్ చేయాలన్న ఆదేశాలు వస్తాయన్న అంచనాలతో టెస్లా విలువ మరింతగా పెరిగింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle