newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

13-01-202113-01-2021 11:40:16 IST
Updated On 13-01-2021 11:54:24 ISTUpdated On 13-01-20212021-01-13T06:10:16.665Z13-01-2021 2021-01-13T05:58:51.664Z - 2021-01-13T06:24:24.019Z - 13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్ మ్యాప్స్.. ఒకప్పుడు అంటే వాళ్ళను అడిగి.. వీళ్ళను అడిగి వెళ్లాల్సిన ప్రాంతానికి చేరుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం గూగుల్ మ్యాప్స్ ఉన్నాయన్న ధైర్యంతో వెళ్ళిపోతూ ఉంటాం. చేరాల్సిన గమ్యస్థానం గురించి నొక్కి.. గూగుల్ మ్యాప్స్ ను చూసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా మందికి అలవాటు. కొన్ని కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ తికమక పెట్టేస్తూ ఉంటాయి. 

ఇక గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ప్రయాణం సాగించగా  ఓ కారు ఏకంగా డ్యామ్‌లోనే పడిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పుణెకు చెందిన గురు శేఖర్ (42) మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్‌ కారులో ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్నారు. డ్రైవర్ సతీష్‌, మిత్రుడు సమీర్, మరో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కు వెళ్లారు. మధ్యాహ్నం వేళ అక్కడకు బయలుదేరిన వీళ్లు మధ్యలో దారి తప్పిపోయారు. దీంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించారు. 

అది రాంగ్‌ రూట్  చూపించిందని తెలియని ఈ బృందం గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అవుతూ పోయారు. చీకటిపడినా గూగుల్‌ మ్యాప్‌ చూపిస్తుందన్న ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనివ్వగా అది కాస్తా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.  అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. సతీష్‌కు ఈత రాకపోవడంతో బయటకురాలేక పోయాడు. కారులోనే ప్రాణాలొదిలాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అక్కడికి కొంతదూరంలో కారును పోలీసులు గుర్తించారు. అందులో సతీష్‌ మృతదేహం కూడా ఉంది. అక్కడ బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమే అయినా.. అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మాధ్నే తెలిపారు. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జి పై నుంచి నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. ఈ బ్రిడ్జికిపైనే పెద్ద డ్యామ్ ఉన్న కారణంగా, నీటిని విడుదల చేసినప్పుడు బ్రిడ్జిమునిగిపోతుందని వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని చాలా మంది గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మకూడదని అంటున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle