newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

22-03-202122-03-2021 14:18:40 IST
2021-03-22T08:48:40.159Z22-03-2021 2021-03-22T08:48:29.074Z - - 20-04-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా తన ప్రత్యర్థులపై అబద్ధాలు విపరీతంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ట్విట్టర్ లో ఎన్నో అబద్దాలు చెప్పడం కూడా గమనించారు. ట్రంప్ మీడియా కంటే సామాజిక మాధ్య‌మాలనే బాగా వాడుకునే వారు. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌న్నింటినీ ట్విట్ట‌ర్ ద్వారానే చెప్పేవారు. ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్ప‌డిన అనంత‌రం ట్రంప్ ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర ఖాతాల‌న్నింటినీ ఆయా సంస్థ‌లు బ్లాక్ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ ఏదీ స్పందించలేకపోతున్నారు. దీంతో ఆయనకు పబ్లిసిటీ కూడా బాగా తగ్గిపోయింది. ఈ ఎన్నికలతో తాను ఓడిపోయినట్లు ఒప్పుకోనని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ప్రజలకు మరోసారి సోషల్ మీడియా ద్వారా దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. 

తాజాగా అమెరికన్ మీడియా డొనాల్డ్ ట్రంప్ గురించి ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోని ఆయా ఖాతాల‌ను వినియోగించుకోలేక‌పోతోన్న ట్రంప్ కొత్తగా తానే సోష‌ల్ మీడియా సంస్థ‌ను నెలకొల్పి, అందులో ఓ ఖాతాను ప్రారంభించాల‌ని భావిస్తున్నారని అంటున్నారు. మూడు నెల‌ల త‌ర్వాత ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా రీ ఎంట్రీ ఇస్తార‌ని ఆయ‌న‌ సీనియర్‌ సలహాదారు జేస‌న్ మిల్ల‌ర్ చెప్పారు. ట్రంప్ ప్రారంభించనున్న ఈ సోష‌ల్ మీడియా గ్రూపు చాలా భిన్నంగా ఉంటుంద‌ని.. అది సోష‌ల్ మీడియా చ‌రిత్ర‌నే మార్చేస్తుందని తెలిపారు. ట్రంప్ కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నార‌ని జ‌రుగుతోన్న‌ ప్ర‌చారం ఆస‌క్తిని రేపుతున్నా.. ఈ అంశానికి సంబంధించి ఇతర వివరాలేవీ తెలియ‌రాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ కాస్త వెయిట్ చేయాల్సిందే..! ఇక ట్రంప్ దగ్గర ఎలాగూ డబ్బు ఉంది కాబట్టి.. ఈయన సొంతంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను సృష్టించాలని అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఆ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇతరులకు కూడా నచ్చుతుందా..? లేక ఫెయిల్యూర్ అవుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.   

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle