newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

06-04-202106-04-2021 14:42:06 IST
Updated On 06-04-2021 09:44:25 ISTUpdated On 06-04-20212021-04-06T09:12:06.417Z06-04-2021 2021-04-06T03:17:18.882Z - 2021-04-06T04:14:25.615Z - 06-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ఉన్నారు. ఎంతో మంది అమాయకులను సైబర్ నేరుగాళ్లు ఎప్పటికప్పుడు మోసం చేస్తూ డబ్బులను లాగేసుకుంటూ ఉన్నారు. చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతూ ఉన్నారు. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ను కూడా వదలలేదు సైబర్ నేరగాళ్లు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేసే ఓ అధికారిణినే బోల్తా కొట్టించారు. ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ. 1.63 లక్షలు కాజేశారు. 

ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతానికి చెందిన ఆ అధికారిణి కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆమె విదేశాలకు వెళ్లేందుకు 'మేక్ మై ట్రిప్' పోర్టల్ ద్వారా ఫ్లయిట్ టికెట్లు కొనుగోలు చేశారు. ఆమె తన ప్రయాణ తేదీలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంటర్నెట్ లో ఉన్న 'మేక్ మై ట్రిప్' కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ సగంలోనే కట్ అయింది. సైబర్ నేరగాళ్లు తన కాల్ ను హైజాక్ చేశారని ఆ ఇంటెలిజెన్స్ అధికారిణి గుర్తించలేకపోయారు. కాసేపటికి ఆమె ఫోన్ కు ఓ కాల్ వచ్చింది. తాము 'మేక్ మై ట్రిప్' కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో ఆమె సమస్య మొత్తాన్ని వారికి వివరించారు.

ముఖ్యమంత్రి కుమార్తెను ఆన్ లైన్ లో మోసం చేసిన కేటుగాళ్లు

దీంతో మీ మొబైల్‌కు ఓ లింక్‌ పంపిస్తామని, దాని ద్వారా ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చని సైబర్ నేరగాళ్లు చెప్పుకొచ్చారు. ఫోన్ కి వచ్చిన లింక్‌ను ఆమె క్లిక్‌ చేయడంతో ఆ నంబర్‌కు లింకైన బ్యాంకు ఖాతా నుంచి రూ.1,62,999 మాయమయ్యాయి. దీనిపై ఆమె వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లింకుపై క్లిక్ చేయగానే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1,62,999 సైబర్ నేరగాళ్ల వ్యాలెట్ ఖాతాలోకి వెళ్లిపోయాయని గ్రహించింది.

మోసం గుర్తించిన ఆ ఇంటెలిజెన్స్ అధికారిణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యాలెట్ ఖాతాను వెంటనే స్తంభింపచేశారు. ఆపై ఒకటిన్నర లక్షల రూపాయలను ఆమె ఖాతాలోకి తిరిగి జమ చేయించారు. ఏకంగా కాల్ హైజాక్ చేశారు అంటే ఎంత తెలివిగా సైబర్ మోసగాళ్లు మాయ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ అధికారిణికే ఇలా జరిగింది అంటే.. సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటో..! ఏది ఏమైనా ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.  

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   14 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

   13-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle