newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

క్రెడిట్.. డెబిట్ కార్డుల విషయంలో కీలక సూచనలు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

30-09-202030-09-2020 13:44:11 IST
2020-09-30T08:14:11.260Z30-09-2020 2020-09-30T08:14:02.511Z - - 30-10-2020

క్రెడిట్.. డెబిట్ కార్డుల విషయంలో కీలక సూచనలు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరి కొత్త గైడ్ లైన్స్ ను రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు అమలు లోకి రాబోతున్నాయి.  క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయనున్నాయి.  తమ కార్డులను విదేశాల్లో వాడుకోవాలనుకుంటే బ్యాంకు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెబుతోంది. 

ఒకవేళ తమకు అంతర్జాతీయ లావాదేవీల అవసరం ఉంది అనుకుంటే బ్యాంకు అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెబుతోంది. అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు.

పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందేలా ముందుగానే పరిమితులను విధించుకోవచ్చు. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించేలా మార్పులు చేసుకోవచ్చు. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్ లైన్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డు దారుడు కోరుకుంటేనే ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఈ కొత్త నిబంధనలతో బ్యాంకుల మోసాలు తగ్గుతాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలకు ఎంతో మంది బలవుతూ ఉన్నారు. ఎప్పుడు ఎలా మోసపోయామో కూడా నెటిజన్లకు సరైన అవగాహన ఉండదు. డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాక కానీ.. తెలిసి లబోదిబో అనాల్సి ఉంటుంది. ఆన్ లైన్ కేటుగాళ్ల బారిన పడకూడదు అని అనుకుంటే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle