newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్

11-01-202111-01-2021 23:13:12 IST
2021-01-11T17:43:12.476Z11-01-2021 2021-01-11T17:43:09.749Z - - 17-01-2021

కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనవరి 16 నుంచి కరోనా టీకాల పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయడంలో ఆన్ లైన్ వేదికగా కోవిన్ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ భారత్‌లో 16న ప్రారంభం కానుంది. తొలుత సుమారు 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ యోధులకు టీకా  ఇవ్వనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారికి, 50 లోపు వయస్సున్న దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

టీకా పంపిణీ సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. 

‘ఎంపవర్డ్‌ గ్రూప్‌ ఆన్‌ టెక్నాలజీ అండ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ టు కంబాట్‌ కోవిడ్‌–19’ చైర్మన్‌ రామ్‌ సేవక్‌ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం  కూడా ఇందులో పాల్గొంది. 

టీకా పంపిణీకి ప్రాతిపదికగానే కాకుండా, బ్యాక్‌అప్‌గా కూడా ‘కోవిన్‌’ సాఫ్ట్‌వేర్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని శర్మ తెలిపారు.  సులువుగా వినియోగించేలా దీన్ని రూపొందించామన్నారు.  

ఇది ఆధార్‌ డేటాను కూడా వినియోగించుకుంటుందని, పౌరులంతా తమ ప్రస్తుత మొబైల్‌ నెంబర్‌ను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానించుకునేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. తద్వారా వారికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం అందించడం సులువవుతుందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌కు భారత్ నాంది పలకున్న సందర్భంగా యావత్ ప్రపంచం దృష్టి ప్రస్తుతం భారత్ వైపే ఉందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తొలివిడతో 30 కోట్లమందికి అందించననన్న టీకాల కార్యక్రమాన్ని అందించడానికి భారతదేశం ఎలా సిద్ధమవుతోందని ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle