newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

భారతదేశం మీద చైనా-పాకిస్థాన్ లు డ్రోన్లతో చెక్ పెట్టబోతున్నాయా..?

26-12-202026-12-2020 17:29:12 IST
Updated On 26-12-2020 17:40:33 ISTUpdated On 26-12-20202020-12-26T11:59:12.462Z26-12-2020 2020-12-26T11:53:19.410Z - 2020-12-26T12:10:33.664Z - 26-12-2020

భారతదేశం మీద చైనా-పాకిస్థాన్ లు డ్రోన్లతో చెక్ పెట్టబోతున్నాయా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారతదేశానికి పక్కనే ఉన్న చైనా-పాకిస్థాన్ లు చేస్తున్న దుశ్చర్యలు అన్నీ-ఇన్నీ కావు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఓ వైపు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండగా.. భారత్ లోకి తీవ్ర వాదులను పంపి ప్రశాంతత లేకుండా చేయాలనేది పాకిస్థాన్ పన్నాగం. ఇక భారత్ కు వ్యతిరేక చర్యల్లో చైనా-పాకిస్థాన్ లు ఎప్పుడూ పాల్గొంటూ ఉంటాయి. ఎలాగైనా భారత్ ను దెబ్బ కొట్టాలన్నది పాకిస్థాన్ ప్లాన్..! అందుకు చైనా సపోర్ట్ ఎలాగూ ఉంది.  తాజాగా పాకిస్థాన్ కు డ్రోన్ల విషయంలో చైనా అండగా నిలిచింది.. ఇక అందుకు తగ్గట్టుగా చైనా మీడియా కూడా ఆహా.. ఓహో గొప్ప డీల్ అంటూ చంకలు గుద్దుకుంటూ ఉంది. 

ఇంతకూ పాక్ కు చైనాకు మధ్య జరిగిన డీల్ ఏమిటంటే.. పాకిస్థాన్ కు 50 సాయుధ డ్రోన్ లను అందించడానికి చైనా సిద్ధమవుతోంది.   ఈ డ్రోన్లన్నీ పూర్తిగా ఆయుధాలను తమతో మోసుకెళ్లగలవని, వీటిని త్వరలో పాక్‌కు అందించేస్తున్నారట.  చైనా అభివృద్ధి చేసిన వింగ్ లూంగ్-2 డ్రోన్లు పూర్తి సాయుధ టెక్నాలజీతో పనిచేస్తాయని.. పూర్తి స్థాయిలో ఆయుధాలను మోసుకెళ్లి నిర్దిష్ట ప్రాంతంలో జారవిడిచే కెపాసిటీ వీటికి ఉంది. ఈ డీల్ ద్వారా పాక్ భారత్‌ ను తీవ్ర ఇబ్బందులు పెట్టొచ్చని చైనా మీడియా సంచలన ప్రకటన చేసింది.   భారత మిలటరీ ఈ డ్రోన్లను ఎదుర్కోలేదని.. లిబియా, సిరియా, అజర్‌బైజాన్ ఘర్షణల్లో సాంప్రదాయ యుద్ధాన్ని నమ్ముకున్న ప్రత్యర్థులను ఈ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయని గుర్తు చేశారు. ఇలాంటి డ్రోన్లు చైనా, టర్కీ వద్ద మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు పాక్ కూడా ఆ లిస్టు లోకి చేరబోతోందని చెప్పుకొచ్చింది చైనా మీడియా. 

చైనా మీడియా వ్యాఖ్యలకు భారత్ అదిరిపోయే కౌంటర్ ను ఇచ్చింది. డ్రోన్లు తయారు చేసింది చైనా కదా.. అవి పని చేస్తాయో లేదో చూసుకోవాలని సూచించింది. చైనా డ్రోన్లు పనిచేస్తాయో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని భారత్ కౌంటర్ ఇచ్చింది. తమకు పట్టున్న ప్రాతంలో మాత్రమే డ్రోన్లతో దాడి చేయవచ్చని.. ఎక్కడికైనా వెళ్లి దాడి చేయడం సాధ్యం కాదని భారత్ వివరించి చెప్పింది. ఆఫ్ఘన్‌ గగనతలంపై పట్టు ఉండడం వల్లే అమెరికా ఉగ్రవాదులపై, వారి స్థావరాలపై దాడులు చేయగలుగుతుందని.. సరిహద్దుల వద్ద భారత్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి దాడులకు చైనా లేదా పాకిస్థాన్‌కు అంత సీన్ లేదని చెప్పింది. పాకిస్థాన్‌, చైనా సరిహద్దులోని భారత రాడార్లు, యుద్ధ విమానాల అనుక్షణం నిఘా ఉంటాయని, వాటిని దాటుకుని లోనికి రావడం చైనా యుద్ధవిమానాలకు కూడా సాధ్యం కాదని వివరించింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle