newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

బోర్డ‌ర్ గొడ‌వ‌ల‌కీ చైనా ఫోన్ కీ లింకు..?

16-10-202016-10-2020 12:05:09 IST
Updated On 16-10-2020 13:34:26 ISTUpdated On 16-10-20202020-10-16T06:35:09.749Z16-10-2020 2020-10-16T06:35:07.925Z - 2020-10-16T08:04:26.526Z - 16-10-2020

బోర్డ‌ర్ గొడ‌వ‌ల‌కీ చైనా ఫోన్ కీ లింకు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా ఫోన్ల‌కి మూడిన‌ట్లే ఉంది. పీఎం మోడీ త‌ల‌చుకుంటే మూడ‌దా ఏంటి. చెప్పండి. జ‌స్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ లేకుండా సందు చూసి.. సాచి కొట్టాల‌ని చూస్తోంది సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్. యాప్ లు బంద్ చేసి.. డ్రాగ‌న్ కాళ్లూ రెక్క‌లు విరిచారు క‌దా. ఇక చైనా ఫోన్ల‌ని బ్యాన్ చేసి బొక్క‌ల్ షుర షుర చేయాల‌ని ప్లానేస్తున్నారు ఇండియన్ ఆఫీస‌ర్లు. దానిపై ప‌క్కా ప్లానింగ్ తో ఉన్నార‌ట‌.

టార్గెట్ ఫిక్స్ అయింది కానీ.. కొట్టే దారి, ఎక్కుపెట్టే టైమూ క‌న్ఫామ్ కాలేదు. మొత్తం చైనా ఫోన్ల‌న్నీటినీ బ్యాన్ చేస్తే.. చైనా వాళ్ల తిక్క కుదిరిద్ది అనుకుంటున్నార‌ట‌. మ‌న ద‌గ్గ‌ర ఉన్న చైనా బిజినెస్సుల్లో స్మార్ట్ ఫోన్ల వాటానే ఎక్కువ‌. మ‌న దేశంలో త‌యారైన ఫోన్ల వాటా 1 శాతం కూడా ఉండ‌దు కానీ.. చైనా ఫోన్ల వాటా.. 50 శాతానికి పైనే ఉంటుంది. ఓ కంపెనీ ఫోన్ వాటా అయితే ఏకంగా 20 శాతానికి పైగా ఉందంటే ఆలోచించండి.. వాళ్ల బిజినెస్ ఏ రేంజ్ లో న‌డుస్తోంది. బోర్డ‌ర్ లో కుప్పిగంతులు వేస్తున్న చైనాకి ఇలా బుద్ధి చెప్పాల‌ని చూస్తోందంట‌. మా ద‌గ్గ‌ర వ్యాపారం చేసుకుంటూ బ‌తికే మీరు.. మా బోర్డ‌ర్ నే ఆక్ర‌మించాల‌ని చూస్తారా అని రివ‌ర్స్ అటాక్ చేయాల‌ని చూస్తోంద‌ట సెంట్ర‌ల్ స‌ర్కార్. ఏటా భార‌త్ లో రెండు ల‌క్ష‌ల ప‌ద‌మూడు కోట్లు ఫోన్ల బిజినెస్ న‌డిస్తే.. అందులో కేవ‌లం చైనా ఫోన్ల బిజినెస్సే ల‌క్షా 40 కోట్లంట‌. చైనా ఫోన్లు స్టాండార్డ్ గా ఉండ‌వు అని కామెంట్లు గ‌ట్టిగానే ఉన్నా.. వాళ్ల బిజినెస్ ట్రిక్స్ తో జ‌నాల్ని బానే బోల్తా కొట్టిస్తూ అమ్మేస్తున్నారు. కానీ.. ఇక‌పై ఆట‌లు సాగ‌వ‌ట‌.

యాప్ లు నిషేధించిన‌ప్పుడు అయితే.. మ‌న వాళ్ల డేటా చోరీ చేస్తున్నారు అదీ ఇదీ అని ఏదేదో చెప్పి.. చ‌ల్ అంటూ మెడ‌ప‌ట్టి గెంటేశాం. కానీ.. ఇప్ప‌టికిప్పుడు ఫోన్లు బ్యాన్ చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నార‌ట‌. ఒక వేళ బ్యాన్ చేసినా.. ఫోన్లు స‌రిపోయేన్ని రావాలంటే ఇమీడియ‌ట్ గా వ‌స్తాయా లేదా అని చూస్తున్నార‌ట‌. ఫైన‌ల్ గా అయితే బ్యాన్ క‌న్ఫామ్ అని టాక్. ఒక వేళ బ్యాన్ కి కానీ.. ఉన్న ఫ‌ళంగా వీలుకాక అగ్రిమెంట్ల‌తో ఇరిటేష‌న్ ఉంటే.. య‌ట్ లీస్ట్ కండిష‌న్లు అయినా.. ఫుల్లుగా పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle