చంద్రయాన్-3 వాయిదా
22-02-202122-02-2021 08:24:27 IST
Updated On 22-02-2021 10:21:21 ISTUpdated On 22-02-20212021-02-22T02:54:27.705Z22-02-2021 2021-02-22T02:54:11.784Z - 2021-02-22T04:51:21.176Z - 22-02-2021

ఇస్రో ఎన్నో అద్భుతాలను ఇటీవలి కాలంలో సృష్టిస్తున్న సంగతి తెలిసిందే..! ఒక ప్రయోగం తర్వాత మరో ప్రయోగం.. ఇలా ఎంతో మంచి సక్సెస్ రేట్ తో ఇస్రో దూసుకుని వెళ్తోంది. రాబోయే కాలంలో మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఇస్రో ప్రణాళికలు సృష్టిస్తోంది. తాజాగా చంద్రునిపైకి మూడో మిషన్ ప్రయోగం చంద్రయాన్–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో చీఫ్ కె.శివన్ తెలిపారు. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన చంద్రయాన్–3 వంటి పలు ప్రాజెక్టులు వాయిదా పడ్డాయని తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్–3ని 2020 చివర్లో ప్రయోగించాల్సి ఉండగా.. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే చంద్రయాన్–3లో ఉపయోగిస్తామన్నారు. 2019లో చంద్ర యాన్–2 మిషన్‌లో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో విఫలమైంది. దీంతో ఈసారి మాత్రం ఎటువంటి తప్పు జరగకుండా ఇస్రో ప్రణాళికలు రచిస్తూ ఉంది. 2019లో నిర్వహించిన చంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో, లోటుపాట్లను దిద్దుకుని ముందుకు వెళతామని వివరించారు. 2020లోనే చంద్రయాన్-3 నిర్వహించాల్సి ఉన్నా, కరోనా మహమ్మారి వ్యాప్తి ఇస్రో ప్రణాళికలకు విఘాతం కలిగించింది. కరోనా వ్యాప్తి కారణంగా చంద్రయాన్-3 మాత్రమే కాకుండా, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కూడా వాయిదా పడిందని శివన్ వెల్లడించారు. ఈ ప్రయోగాలను 2022లో చేపడతామని చెప్పారు. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్–3 కీలకం కానుంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని తర్వాత, మరో మానవ రహిత మిషన్ ప్రయోగం ఉంటుం దని, మూడో విడతలో ప్రధాన ప్రయోగం చేపడతామన్నారు. గగన్‌యాన్ ద్వారా 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షం లోకి పంపనున్నారు. ఇందుకుగాను ఎంపికైన ముగ్గురు పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. మూడో విడత ప్రయోగించే గగన్‌యాన్ మాడ్యూల్‌కు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. భారత ప్రజలు మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం ఈ ప్రయోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి. మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్‌గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021

వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-2021
ఇంకా