newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

24-11-202024-11-2020 16:00:42 IST
Updated On 24-11-2020 16:04:57 ISTUpdated On 24-11-20202020-11-24T10:30:42.803Z24-11-2020 2020-11-24T10:30:34.911Z - 2020-11-24T10:34:57.063Z - 24-11-2020

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి మరో ఐదు యాప్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు స్వల్ప కాలిక రుణాలు అందించే ఐదు యాప్స్‌ను తొలగిస్తూ గూగుల్ ప్లే స్టోర్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోడానికి ముఖ్య కారణం.. వినియోగదారులకు ఎక్కువ వడ్డీరేట్లకు స్వల్ప కాలిక రుణాలను అందించడంతో పాటు తిరిగి రుణాలు తీసుకున్న వారిని వేధించడమే. తక్కువ సమయంలోనే రుణాలు ఇస్తూ వస్తున్న యాప్ కంపెనీలు, ఆ తర్వాత పీడించసాగాయి. ఈ ఘటనలు వార్తల్లో కూడా వచ్చాయి.  

గూగుల్‌ ప్లే స్టోర్‌ డెవలపర్‌ విధానాలు వినియోగదారులను కాపాడడానికి వారిని సురక్షితంగా ఉంచుతాయని.. అందుకే ఈ యాప్స్ ను తొలగిస్తూ వస్తున్నామని గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది. త్వరగా నగదు అవసరమైనప్పుడు అందించడానికి లాక్‌డౌన్‌ సమయంలో  గుర్తింపు లేని యాప్స్‌ వచ్చాయి. ఈ యాప్స్‌ పేర్లు కూడా గుర్తింపు ఉన్న కంపెనీల పేర్లతో పోలి ఉండటంతో ప్రజలకు వీటి మధ్య ఉన్న తేడా పెద్దగా తెలియడం లేదు. వీటిని 4,00,000 నుంచి 1 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేశారని‌ పరిశోధకులు చెబుతున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన వాటిలో ఓకే క్యాష్‌, గో క్యాష్‌, ఫ్లిఫ్‌ క్యాష్‌,ఈ క్యాష్‌, స్నాప్‌ ఇట్‌ లోన్‌ యాప్స్‌ ఉన్నాయి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle