వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-202118-02-2021 13:12:54 IST
Updated On 18-02-2021 15:30:04 ISTUpdated On 18-02-20212021-02-18T07:42:54.070Z18-02-2021 2021-02-18T07:42:47.558Z - 2021-02-18T10:00:04.484Z - 18-02-2021

చెప్పినట్లుగానే ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో వార్తలు షేర్ చేయకుండా కఠిన నిర్ణయం తీసుకుంది ఫేస్ బుక్ సంస్థ. గురువారం ఉదయం నుంచి న్యూస్ ఫీడ్ ను బ్లాక్ చేసేస్తోంది ఫేస్ బుక్ సంస్థ. వార్తలు షేర్ చేస్తే సంబంధిత మీడియా సంస్థలకు సోషల్ మీడియా సైట్లు చెల్లింపులు చేయాలన్న ఆ దేశ కొత్త చట్టం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. ఈ ప్రభావం మీడియా సంస్థల మీద మాత్రమే కాకుండా అగ్నిమాపక విభాగం, ఆరోగ్య శాఖ, వాతావరణ శాఖతో పాటు పలు అత్యవసర సేవలకు సంబంధించి వార్తా సమాచారం ఆగిపోయింది. ఆయా విభాగాలు, ప్రజలు అత్యవసర సేవల పేజీల్లో వార్తలను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫేస్ బుక్ చర్యపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. వార్తలు షేర్ కాకుండా బ్లాక్ చేయడం ప్రమాదకర సంకేతమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారిక గ్రూపులనూ వార్తల విషయంలో బ్లాక్ చేయడం వల్ల.. తప్పుడు వార్తల బెడద పెరిగిపోయే ప్రమాదముందని మీడియా సంస్థలు, ఆస్ట్రేలియా ప్రభుత్వం మండిపడ్డాయి. పేజీలను బ్లాక్ చేసేముందు ఫేస్ బుక్ బాగా ఆలోచించుకోవాల్సిందని ఆ దేశ సమాచార శాఖ మంత్రి పాల్ ఫ్లెచర్ అన్నారు. మీడియా సంస్థల పేజీలనూ బ్లాక్ చేయడం చాలా తప్పు అని అన్నారు. ఫేస్ బుక్ స్పందిస్తూ ప్రభుత్వ పేజీలకు ఎలాంటి అంతరాయం ఉండదని.. వాటిపై పడబోదని స్పష్టతనిచ్చింది. ఫేస్ బుక్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. చట్టంలో చాలా లోపాలున్నాయని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫేస్ బుక్ మేనేజర్ విలియం ఈస్టన్ అన్నారు. వినియోగదారులతో సంబంధాలపై నిజానిజాలను మరచి చట్టాలను పాటించాలా? లేక యూజర్లు వార్తలు షేర్ చేయకుండా బ్లాక్ చేయాలా? అన్న దానిపై ఎంతగానో ఆలోచించామని, చివరకు దురదృష్టవశాత్తూ రెండో దానికే కట్టుబడ్డామని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని వార్తా కథనాలకు సంబంధించి ఆయా వార్తాసంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా ఆ దేశం కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీనిని ఫేస్బుక్, గూగుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత డిసెంబరులో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా.. సెనెట్ ఎకనమిక్స్ లెజిస్టేషన్ కమిటీ ఎలాంటి మార్పులు అవసరం లేదని నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో వార్తలను షేర్ చేయడాన్ని ఫేస్బుక్ నిషేధించింది.

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్‌గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021
ఇంకా