newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

14-01-202114-01-2021 09:05:03 IST
2021-01-14T03:35:03.895Z14-01-2021 2021-01-14T03:34:57.905Z - - 20-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

యాపిల్ ఎయిర్ పోడ్స్.. ప్రస్తుతం యాపిల్ యూజర్లు తెగ వాడేస్తూ ఉన్నారు. అయితే ఛార్జింగ్ తోనే సమస్యలు అంటూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సరికొత్త ఆవిష్కరణ కోసం యాపిల్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఐఫోన్ మొబైల్ మీద ఎయిర్ పోడ్స్ ను పెడితే చాలు అవే ఛార్జింగ్ అయ్యేలా కొత్త మొబైల్ కేసు ను తీసుకుని రానున్నారు. ఐఫోన్ కేస్ కు సంబంధించిన బొమ్మ ప్రస్తుతానికి విడుదల చేశారు. ఈ కొత్త కేస్ కోసం పేటెంట్ హక్కుల కోసం యాపిల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ పోడ్స్ ఈ సరికొత్త యాపిల్ ఐఫోన్ కేస్  ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కేవలం ఆ కేస్ మీద పెట్టడం ద్వారా ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ అవ్వడం అన్నది ప్రాక్టికల్ సొల్యూషన్ అని అంటున్నారు. మొత్తం మూడు వేరియేషన్స్ లో ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ అన్నది జరుగుతుందని యాపిల్ సంస్థ భావిస్తోంది.   

యాపిల్ ఇందుకు సంబంధించిన అప్రూవల్ కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. యాపిల్ కేస్ మీద ఎయిర్ పోడ్స్ ను ఉంచవచ్చు. అలా ఉంచిన ఎయిర్ పోడ్స్ అతుక్కుని ఉండి ఛార్జింగ్ అయ్యేలా రూపొందించనున్నారు. ఎయిర్ పోడ్స్ ఇయర్ బడ్స్ ను ఆ మొబైల్ కేస్ మీద ఉంచితే ఛార్జింగ్ అన్నది జరిగిపోతూ ఉంటుంది. ప్రతి సారీ ఎయిర్ పోడ్స్ కేస్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. ఐఫోన్ కేస్ కు మ్యాగ్నెట్ ఉండనుంది. ఇటీవలే ఐఫోన్ 12 సిరీస్ కు మ్యాగ్ సేఫ్ ఫీచర్ ను అందించారు. దీని ద్వారానే ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కూడా సులభంగా ఛార్జింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఆ కొత్త మొబైల్ కేస్ కు డిస్ప్లే తో పాటూ ఇంటర్నల్ సర్క్యూట్రీ, బ్యాటరీ బ్యాక్ కూడా ఉండనుంది. ముఖ్యంగా ఫ్లిప్ కవర్ ద్వారా కూడా ఎయిర్ పోడ్స్ ను ఛార్జ్ చేయడం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓ వైపు మొబైల్ ను వినియోగిస్తూనే.. మరో వైపు ఫ్లిప్ కవర్ ద్వారా ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ ఫ్లిప్ కవర్ కు బయటి భాగంలో రెండు ఎయిర్ పోడ్స్ ను ఉంచేందుకు వీలు ఉన్న కేవిటీలు ఉన్నాయి. వాటిలో ఉంచడం ద్వారా ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ అవుతాయి. ఇక డిస్ప్లే కూడా ఉండడం.. ఎయిర్ పోడ్స్ లో ఎంత ఛార్జింగ్ ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఉండనుంది. యాపిల్ సంస్థ ఐఫోన్ కేసెస్ ను పలు విధాలుగా ఉపయోగపడేలా చేయాలని భావిస్తోంది. అయితే ఈ కాన్సెప్ట్ ఆఖరికి పూర్తీ అవుతాయా అన్నది తెలియాల్సి ఉంది. ఈ కేసెస్ ను పూర్తీ చేయాలంటే యాపిల్ ఎంత సమయం తీసుకుంటుందో..?    


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle