newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

అమిత్ షా ట్విట్టర్ ఖాతా ఫోటో విషయంలో తికమక

13-11-202013-11-2020 12:19:13 IST
Updated On 13-11-2020 13:29:57 ISTUpdated On 13-11-20202020-11-13T06:49:13.365Z13-11-2020 2020-11-13T06:49:04.601Z - 2020-11-13T07:59:57.261Z - 13-11-2020

అమిత్ షా ట్విట్టర్ ఖాతా ఫోటో విషయంలో తికమక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాపీరైట్ ఉల్లంఘన.. ప్రస్తుతం ట్విట్టర్ విషయంలో చాలా తికమకలు ఏర్పడ్డాయి. ట్విట్టర్ కాపీరైట్ పాలసీ ప్రకారం ఫొటోగ్రాఫ్‌లో ఉన్నది కాకుండా ఆ ఫొటోను తీసిన వ్యక్తే దాని హక్కుదారుడు అవుతాడని చెబుతోంది. అంటే.. ఎవరైనా మీ ఫోటో తీసి ఉంటారనుకోండి.. ఆ ఫోటోలో ఉన్నది మీరైనప్పటికీ.. ఫోటో తీసిన వ్యక్తికే కాపీరైట్ హక్కులు ఉంటాయి. ఫోటోలో మీరు ఉన్నా సరే తీసిన వ్యక్తి కాపీరైట్స్ ఉల్లంఘన చేశారని ఫిర్యాదు చేస్తే ఆ ఫోటోను డిలీట్ చేసేయాల్సిందే.. లేదంటే అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇటీవల బీసీసీఐ విషయంలో ట్విట్టర్ అలాంటి నిర్ణయమే తీసుకుంది. కాపీరైట్ ఉల్లంఘన కారణంగా బీసీసీఐ డిస్‌ప్లే ఫొటోను ఇటీవల ట్విట్టర్ తొలగించింది. 

తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విషయంలోనూ అలాంటిదే చోటు చేసుకుంది. ట్విట్టర్ డిస్‌ప్లే ఫొటోను ట్విట్టర్ తొలగించింది. ఓ కాపీరైట్ హోల్డర్‌ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఫొటోను తొలగించినట్టు ట్విట్టర్ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఫొటోను పునరుద్ధరించింది.

అమిత్ షా ఫొటోపై క్లిక్ చేస్తే బ్లాంక్ పేజ్ కనిపించింది. దాంట్లో ‘కాపీరైట్ హక్కుదారుడి ఫిర్యాదుతో ఫొటోను తొలగించినట్టు ఓ సందేశం కనిపించింది. గ్లోబల్ కాపీరైట్ పాలసీ ప్రకారం అమిత్ షా ఖాతాను తాత్కాలికంగా లాక్ చేసినట్టు ట్విట్టర్ స్పష్టం చేసింది. ఆ తర్వాత కాసేపటికే ఖాతాను పూర్తిగా పునరుద్ధరించారు. 

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

   28-11-2020


దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

   27-11-2020


ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

   26-11-2020


యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

   26-11-2020


మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   25-11-2020


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle