newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

జూన్ వరకు.. వర్క్ ఫ్రమ్ హోమ్

21-10-202021-10-2020 11:47:27 IST
Updated On 21-10-2020 11:54:55 ISTUpdated On 21-10-20202020-10-21T06:17:27.157Z21-10-2020 2020-10-21T06:17:21.445Z - 2020-10-21T06:24:55.292Z - 21-10-2020

జూన్ వరకు.. వర్క్ ఫ్రమ్ హోమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా దేశంలో విజృంభిస్తున్న సమయంలో ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇచ్చాయి. ఇప్పుడు కరోనా తగ్గుతూ ఉండడం.. ప్రభుత్వం కూడా సడలింపులు ఇస్తూ ఉండడంతో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. కానీ కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని మరింత పొడిగిస్తూ వస్తున్నాయి. 

ఆ లిస్టులోకి అమెజాన్ సంస్థ కూడా చేరింది. త‌న ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ను పొడిగించింది. వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కు ఇంటి నుంచి ప‌ని చేయ‌వ‌చ్చు అని తెలిపింది. ఎవరైతే గత కొన్ని నెలలుగా ఇంటి నుండి పని చేస్తూ ఉన్నారో.. వారికి ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. గ‌తంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని జ‌న‌వ‌రి వ‌ర‌కు ఇచ్చిన అమెజాన్ సంస్థ‌.. ఇప్పుడు ఆ స‌మ‌యాన్ని జూన్ 30 వ‌ర‌కు పెంచింది.  అమెరికాలో సుమారు 19 వేల మంది అమెజాన్ వ‌ర్క‌ర్లకు క‌రోనా వైర‌స్ సోకిన నేప‌థ్యంలో ఆ సంస్థ నిర్ణ‌యం తీసుకుంది.

మైక్రోసాఫ్ట్‌, ట్విట్ట‌ర్, ఫేస్‌బుక్, గూగూల్ కూడా ఆఫీసులో అవ‌స‌రం లేని వారికి ఇంటి నుంచి ప‌ని చేసే సౌల‌భ్యాన్ని మరికొన్ని నెలల పొడిగించాయి. కరోనా కొన్ని దేశాల్లో తగ్గుతున్నట్లు కనిపిస్తూ ఉన్నా.. ఇంకొన్ని దేశాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంది. దీంతో  చాలా కంపెనీలు ఇంకా రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కూడా ఎదురు చూడాలని ఇంకొన్ని సంస్థలు చెబుతూ వస్తున్నాయి. అందుకోసమే వర్క్ ఫ్రమ్ హోమ్ ను పొడిగిస్తూ వస్తున్నాయి సంస్థలు.     

కరోనా నేపథ్యంలో తన ఉద్యోగులకు కల్పించిన వర్క్‌ ఫ్రం హోంను ఇకపై శాశ్వతంగా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ కొద్దిరోజుల కిందట ప్రకటించింది. అయితే ఈ అవకాశం కొన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వర్క్‌ ఫ్రం హోంతో మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర కంపెనీలు లాభపడినప్పటికి కోవిడ్‌ ప్రభావం తగ్గగానే తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ తన ప్రకటనలో హర్డ్‌వేర్‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాలలో పని చేస్తోన్న ఉద్యోగులు మినహా ఇతర విభాగాల్లో పని చేసే ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. అలా చేయాలనుకుంటున్న ఉద్యోగుల ఆయా విభాగాలకు చెందిన తమ మేనేజర్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   18 hours ago


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


4 యాప్స్ తీసిన  గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

4 యాప్స్ తీసిన గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

   18-11-2020


ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

   16-11-2020


యాపిల్ ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి

యాపిల్ ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి

   15-11-2020


వన్ ప్లస్ 9 లీక్స్.. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది

వన్ ప్లస్ 9 లీక్స్.. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది

   15-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle