అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!
17-10-202017-10-2020 11:11:17 IST
Updated On 17-10-2020 11:18:05 ISTUpdated On 17-10-20202020-10-17T05:41:17.176Z17-10-2020 2020-10-17T05:40:40.414Z - 2020-10-17T05:48:05.521Z - 17-10-2020

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది. 16వ తేదీనే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మొదలవ్వగా.. మిగిలిన యూజర్లకు నేటి నుండి మొదలైంది. పండుగల నేపథ్యంలో షాపింగ్ చేయాలని అనుకునే వారి కోసం అమెజాన్ మంచి ఆఫర్లను తీసుకుని వచ్చింది. ఈ ఏడాది ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ సంస్థ కూడా 'బిగ్ బిలియన్ డేస్ సేల్' ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే..! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో షాపింగ్ చేయాలని అనుకునే వారికి హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు ఆఫర్లు ఇస్తోంది. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే 10 శాతం డిస్కౌంట్.. దాదాపు 12000 రూపాయల వరకూ ఇవ్వనున్నారు.
మొబైల్ ఫోన్లపై మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 11 మొబైల్ ఫోన్ కొనాలని అనుకున్న వారు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు. 54,900 రూపాయలకు ఐఫోన్ 11 అందుబాటులోకి వచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం51 మొబైల్ ఫోన్ 22499 రూపాయలకే లభిస్తోంది. గెలాక్సీ ఎం31మొబైల్ ను 18499 రూపాయలకు, గెలాక్సీ ఎం31 ను 15499 రూపాయలకు, గెలాక్సీ ఎస్10 ను 39,999 రూపాయలకే అందుబాటు లోకి తీసుకుని వచ్చారు.
అమెజాన్‌లో వన్ ప్లస్ 8 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.41,999 కాగా, ఇప్పుడు రూ.2,000 తక్కువకే అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై రూ.1,750 వరకు అదనపు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎక్స్చేంజ్పై రూ.16,400 వరకు తగ్గింపు లభించనుంది.
రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999 కాగా, ఇప్పుడు ఈ సేల్‌లో రూ.12,999కే అందుబాటులో ఉంది. దీనిపై మొదటిసారి డిస్కౌంట్‌ను కంపెనీ అందించింది. దీంతోపాటు రూ.11,950 ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను అందించారు.
రూ.3,999 విలువైన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపు అందించారు. ఈ టీవీ స్టిక్ ప్రస్తుతం రూ.1,999కే లభిస్తుంది. ఒకవేళ మీది 4కే టీవీ అయితే రూ.5,999 విలువైన ఫైర్ టీవీ స్టిక్ 4కే ప్రస్తుతం రూ.3,599కే అందుబాటులో ఉంది.
ఇక ల్యాప్ టాప్, టీవీలపై.. ఇంకా మరెన్నో వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. షాపింగ్ చేయాలన్న ఉద్దేశ్యం ఉంటే అమెజాన్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయొచ్చు.

వాట్సప్ కు భారత్ వార్నింగ్
16 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా