newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

17-10-202017-10-2020 13:23:37 IST
Updated On 17-10-2020 13:29:06 ISTUpdated On 17-10-20202020-10-17T07:53:37.118Z17-10-2020 2020-10-17T07:53:31.688Z - 2020-10-17T07:59:06.247Z - 17-10-2020

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా సేల్ అంటూ.. ఫ్లిప్ కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్ అంటూ‌ భారీ ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే‌. ఈ ఆఫర్లపై కేంద్రప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి, ఇతర మూలాలు తెలిపే సమాచారం పొందుపర్చక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించేందుకు 15 రోజుల సమయం ఇచ్చింది. ఇకపై ఈ నిబంధనలను ఏ ఈ-కామర్స్‌ సంస్థ ఉల్లంఘించరాదని కేంద్రం స్పష్టం చేసింది.

దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఈ రెండు ఈ – కామర్స్‌ సంస్థలు కూడా భారీ ఆఫర్లను ప్రకటించాయి. బిగ్‌బిలియన్‌ డేస్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ 16 నుంచి 21 వరకు ఆఫర్లను ప్రకటించగా, గ్రేట్‌ ఇండియా ఫెస్టివెల్‌ పేరుతో అమెజాన్‌ ఆఫర్లు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రైమ్ యూజర్లకు ఒకరోజు ముందే ఆఫర్స్ ను చూసుకునే అవకాశం ఇచ్చింది అమెజాన్. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ప్రభుత్వ సూచనలను పాటిస్తాయో లేదో చూడాలి. 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సాధారణ వినియోగదారులకు అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం అయింది. ప్రైమ్ సభ్యులకు మాత్రం ఒక్కరోజు ముందుగా.. అక్టోబర్ 16వ తేదీ నుంచే ప్రారంభం అయింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేల్ అక్టోబర్ 16వ తేదీ నుంచి మొదలైంది. ప్లస్ సభ్యులకు అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయింది.

చాలా వాటి మీద భారీ డిస్కౌంట్లు: 

ఈ సేల్స్ లో మొబైల్ ఫోన్ ల మీద భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఐఫోన్ 11 ధరను రూ.68,300 నుంచి రూ.54,900కు తగ్గించారు. అయితే అమెజాన్ సేల్‌లో దీన్ని మరింత తగ్గించి రూ.47,999కు విక్రయిస్తున్నారు. అంటే దీనిపై అదనంగా మరో రూ.6,901 తగ్గింపు అందించారన్న మాట. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేసే వారికి ఈఎంఐ లావాదేవీలు నిర్వహించేవారికి మరింత తగ్గింపును అమెజాన్ అందించనుంది.

ఐఫోన్ 11 ప్రోపై ఏకంగా రూ.26,601 డిస్కౌంట్‌ను అందించారు దీని బేస్ వేరియంట్ అయిన 128 జీబీ ధర రూ.1,06,600గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీన్ని రూ.79,999కే విక్రయించనున్నారు. ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే దీనిపై మరింత తగ్గింపు కూడా లభించనుంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle