జియోకి వరుస షాక్ లు ఇస్తున్న ఎయిర్ టెల్
24-12-202024-12-2020 20:46:31 IST
Updated On 25-12-2020 11:21:02 ISTUpdated On 25-12-20202020-12-24T15:16:31.247Z24-12-2020 2020-12-24T14:55:23.432Z - 2020-12-25T05:51:02.095Z - 25-12-2020

టెలీకాం రంగంలో ఉండే పోటీ గురించి తెలిసిందే..! కష్టమర్లను ఆకర్షించడానికి ఎన్నో ఆఫర్లను ఇస్తూ ఉంటారు. ఇక కొత్త వినియోగదారులు కొత్త కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఆఫర్లతో పాటూ.. డేటా స్పీడ్.. సంస్థ అందించే సర్వీసులు.. ఇలా చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అందుకే టెలీకాం కంపెనీలు కూడా చాలా విషయాల్లో ఇతర టెలీకాం నెట్వర్క్ లతో పోటీ పడుతూ ఉంటాయి. భారత్ లో జియో అడుగుపెట్టాక సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. జియోతో పోటీ పడడానికి ఎయిర్ టెల్ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మూడవ నెలలో కూడా ఎయిర్టెల్ జియోకు షాకిచ్చింది. కొత వైర్లెస్ చందాదారులకు సంబంధించి జియోను అధిగమించింది. ఎయిర్టెల్ 36.7 లక్షలు కొత్త యూజర్లను సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎయిర్టెల్ అక్టోబర్‌లో 3.67 మిలియన్లకు పైగా కొత్త వైర్లెస్ చందాదారులను సాధించి రిలయన్స్ జియోను అధిగమించింది. జియో 2.22 మిలియన్ల చందాదారులతో పోలిస్తే ఎయిర్టెల్ 1.45 మిలియన్ల ఎక్కువ మంది ఉన్నారు. అక్టోబరులో కొత్తగా ఎయిర్టెల్ 36.7 లక్షలు, జియో 22.2 లక్షల మంది మొబైల్ కస్టమర్లను దక్కించుకున్నాయి. వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ నూతన మొబైల్ కస్టమర్లను పొందలేకపోయాయి. ఎయిర్ టెల్, జియో లతో వోడాఫోన్ ఐడియా (వి) ఎంత పోరాడాలని అనుకున్నా కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. 2.7 మిలియన్ల చందారులను కోల్పోయింది వోడాఫోన్ ఐడియా. సెప్టెంబరులో కూడా అత్యధికంగా కొత్త కస్టమర్లను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. సెప్టెంబరులో ఎయిర్ టెల్ 3.8 మిలియన్ల చందాదారులను పొందగా, జియో 1.5 మిలియన్ల వినియోగదారులను చేర్చుకోగా, వోడాఫోన్ ఐడియా 4.6 మిలియన్ల మందిని కోల్పోయింది. అక్టోబర్ నాటికి అధికారిక సమాచారం ప్రకారం జియో ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 406.36 మిలియన్లుగా ఉండగా, వొడాఫోన్ ఐడియాకు 292.84 మిలియన్ల చందాదారులున్నారు. జియోకు ఎయిర్ టెల్ వరుస షాక్ లు ఇస్తూ వెళుతోంది.

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
an hour ago

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
14 hours ago

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021

వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-2021

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
18-02-2021

పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ధ్వజం
17-02-2021

వాట్సాప్ ను వెంటాడుతూ ఉన్న ప్రైవసీ వివాదాలు
16-02-2021
ఇంకా