newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

12-04-202112-04-2021 15:05:16 IST
Updated On 12-04-2021 10:55:35 ISTUpdated On 12-04-20212021-04-12T09:35:16.402Z12-04-2021 2021-04-12T03:10:48.596Z - 2021-04-12T05:25:35.339Z - 12-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లో తమపై వేధింపులు పెరిగిపోయాయని పలువురు యువతులు ఆరోపిస్తూ ఉన్నారు. 500 మందికి పైగా ఉద్యోగినులు సంతకాలు చేస్తూ, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ కి లేఖను రాశారు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. త‌మ‌ను ఆదుకోని సుర‌క్షితమైన వాతావర‌ణాన్ని క‌ల్పించాల‌ని ఏకంగా 500 మంది ఉద్యోగులు సుంద‌ర్ పిచాయ్‌కు లేఖ రాశారు. తమను ఆదుకోవాలని వారు ఈ లేఖలో వాపోయారు. తమను నిత్యమూ వేధిస్తున్న వారిని ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని, వారిని నియంత్రించాలని కోరారు.

న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో గూగుల్ సంస్థ‌లో జ‌రుగుతున్న వేధింపుల‌పై ఆ సంస్థ‌ మాజీ ఇంజినీర్ ఎమీ నీట్‌ఫీల్డ్ ఒక ఆర్టిక‌ల్ ప్ర‌చురిత‌మైన త‌ర్వాత ఈ లేఖ రాసిన‌ట్లుగా తెలుస్తోంది.  ఎమీ నీట్ ఫీల్డ్, తనపై ఎటువంటి వేధింపులు జరిగాయన్న విషయాన్ని తెలియజేస్తూ, 'న్యూయార్క్ టైమ్స్'కు వ్యాసం రాశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 500 మంది కలిసి ఈ లెటర్ రాశారు. గూగుల్ లో పని చేసిన తరువాత నాకు మరో ఉద్యోగం చేయాలని అనిపించడం లేదని.. ఎమీ తన అనుభవాలను చెప్పారు. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన అతనితో పాటే బలవంతంగా ముఖాముఖి భేటీలు చేయించారని, పక్కనే కూర్చోబెట్టారని.. అతనితో కలసి పని చేయడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినా ఉన్నతాధికారులు ఏ మాత్రమూ పట్టించుకోలేదని, తననే కౌన్సెలింగ్ తీసుకోవాలని, లేకుంటే సెలవుపై వెళ్లాలని సలహాలు ఇచ్చారని ఎమీ సంచలన విషయాలను బయటపెట్టారు.

సంస్థలోని ఎంతో మంది విషయంలో అధికారులు ఇలానే ప్రవర్తించారని చెబుతూ 'గూగుల్‌లో ప‌నిచేసిన త‌ర్వాత.. నేను మ‌ళ్లీ ఉద్యోగాన్ని ప్రేమించ‌ను' అనే శీర్షిక‌తో న్యూయార్క్ టైమ్స్‌లో ఆమె క‌థ‌నం రాసింది. వేధించిన వారినే సమర్ధిస్తున్న వాతావరణం ఉందని, 20 వేల మందికి పైగా పని చేస్తున్న ఆడవాళ్లు లైంగిక వేధింపులకు గురయ్యారని, అయినా మారకపోవడం ఏంటని ప్రశ్నించారు. 

ఈ అంశంపై గూగుల్‌ సంస్థ స్పందిస్తూ.. మొత్తం ప్రక్రియను మార్చుతున్నట్లు తేల్చి చెప్పింది. ఉద్యోగుల సమస్యలను స్వీక‌రించి.. దర్యాప్తు చేసే విధానం, ఆందోళనలను నివేదించే ఉద్యోగుల కోసం కొత్త సంరక్షణ కార్యక్రమాలను ప్రవేశపెట్టామని గూగుల్ స్పష్టం చేసింది. ఇకనైనా గూగుల్ లో ఆడవారిపై లైంగిక వేధింపులు ఆగుతాయో లేదో.. చూడాలి. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle