newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఐదు రోజుల్లో అన్ని వేల కోట్లా..!

22-10-202022-10-2020 11:27:10 IST
Updated On 22-10-2020 11:43:58 ISTUpdated On 22-10-20202020-10-22T05:57:10.450Z22-10-2020 2020-10-22T05:57:05.098Z - 2020-10-22T06:13:58.632Z - 22-10-2020

ఐదు రోజుల్లో అన్ని వేల కోట్లా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జ‌నం మారి పోయారు. మామూలుగానే షాపింగ్ కి వెళ్లే ఓపిక‌ల్లేవు. ఇక క‌రోనా క‌దా. బ‌య‌టికి ఎందుకులే అనుకుంటున్నారు. అందుకే అంతా ఈ కామ‌ర్స్ పై ప‌డ్డారు. పండ‌గ క‌దా. ఫుల్లు ఆఫ‌ర్లు పెట్టేశాయి ఈ కామ‌ర్స్ పోర్టళ్లు. ఆల్రెడీ జ‌నం బాగా అల‌వాటు ప‌డిపోయారు. గుండు పిన్ను కాన్నుంచి టీవీలు ఫ్రిడ్జ్ ల దాకా అన్నీ ఈ కామ‌ర్స్ సైట్ల‌లో కొనేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు క‌దా. ఈ పండ‌గ ఆఫ‌ర్ల‌తో అంద‌రూ రెడీగా ఉన్నారు. ఒక్క‌టే మాట‌.. ఇప్పుడొద్దులే.. పండ‌గ టైంలో ఆఫ‌ర్లు పెడ‌త‌రు అప్పుడు కొందాం. దానికి త‌గ్గ‌ట్లే.. ఈ కామ‌ర్స్ సైట్లు కూడా పోటీ ప‌డి మ‌రీ ఆఫ‌ర్లు పెట్టేస్తున్నాయి. ఆల్రెడీ పెట్టేశాయి కూడా. 

ఈ పండ‌గ సీజ‌న్ కోస‌మే వెయిట్ చేసిన ఈ కామ‌ర్స్ సైట్ లు వాళ్ల ప‌ని వాళ్లు చేశారు. ఈ పండ‌గ సీజ‌న్ కోస‌మే వెయిట్ చేస్తున్న ఈ కామ‌ర్స్ క‌స్ట‌మ‌ర్లు కూడా వాళ్ల ప‌ని వాళ్లు చేశారు. ఫ‌లితంగా ఇళ్ల‌ల్లోకి కొత్త కొత్త సామాన్లొచ్చాయి. వ్యాపారుల‌కేమో.. క‌ట్ట‌ల‌కి క‌ట్ట‌లు క‌రెన్సీ వ‌చ్చింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

జ‌స్ట్ ఒక ఐదు రోజుల్లోనే పిచ్చి సేల్స్ చేశారు జ‌నాలు. ఎన్నాళ్ల నుంచో వెయిటింగ్ క‌దా. ఎడారిలో వాన ప‌డ్డ‌ట్లే ఉంది. సైట్ల‌లో పెట్టిన స‌రుకంతా ఆవిరై పోయిందంట‌. ఏ సైట్ లో ఎక్కువ ప‌ర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారో చూడ్డం బుక్ చేయ‌డం. అవ‌స‌రం లేకున్నా స‌రే.. బ్యాలెన్స్ ఉంటే చాలు. డ‌బ్బులుంటే ఖ‌ర్చైత‌య్.. ఏదైనా వ‌స్తువు కొనుక్కున్న‌ట్లుంట‌ది. ఇలాంటి ఆఫ‌ర్లు మ‌ళ్లీ పెట్ట‌రు అని బుక్ చేసుకున్నారు జ‌నాలు. ఫైన‌ల్ గా ఐదు రోజుల్లో 22 వేల కోట్ల స‌రుకు కొన్నార‌ట జ‌నాలు. బ‌ట్ట‌లు.. వ‌స్తువులు అన్నీ క‌లిసి.. ఫుల్లుగా బుక్ చేసుకున్నారు. దీపావ‌ళి దాకా ఉండే ఆఫ‌ర్ల‌లో ఇంకెన్ని కొంటారో. ఇక ప‌ల్లెటూళ్ల‌కి కూడా డెలివ‌రీలు చేస్తున్నాయి ఈ కామ‌ర్స్ సైట్లు. ఇంకెన్ని బుక్ చేసుకుంటారో ఏమో. 

తిరిగే అవ‌స‌రం లేదు. రిస్క్ లేదు. ఐదొంద‌లో వెయ్యో త‌క్కువే వ‌స్తున్న‌య్.. క్రెడిట్ కార్డుల ఆఫ‌ర్లో.. డెబిట్ కార్డుల ఆఫ‌ర్లో ఉంటూనే ఉన్న‌య్. పైగా ఆ కూప‌న్ ఈ కూప‌న్ అని ఏదో పెట్టేస్తున్నారు. వీటికి తోడు డెలివ‌రీ ఫ్రీ. అస‌లు షాపుల‌కి పోవాల్సిన అవ‌స‌రం ఏంటి చెప్పండి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle