newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ 24 గ్రహాల్లో మనిషి బ్రతకొచ్చట..!

08-10-202008-10-2020 13:07:28 IST
Updated On 08-10-2020 13:23:11 ISTUpdated On 08-10-20202020-10-08T07:37:28.350Z08-10-2020 2020-10-08T07:37:19.327Z - 2020-10-08T07:53:11.268Z - 08-10-2020

ఆ 24 గ్రహాల్లో మనిషి బ్రతకొచ్చట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మానవాళి మనుగడకు భూమి ఇంకొద్ది రోజులే శ్రేయస్కరం అని చెబుతూ ఉన్నారు పర్యావరణ నిపుణులు. ఎందుకంటే మనుషులు ఈ భూమి మీద చేస్తున్న దారుణాలకు భూమి సమతుల్యత ఇప్పటికే బాగా నశించిపోయింది. వాతావరణంలో ఇప్పటికే తీవ్ర మార్పులు మొదలయ్యాయి. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో అని తెలియని పరిస్థితి నెలకొనగా.. మనిషి మనుగడకు ఏయే గ్రహాల్లో సరైన వాతావరణం ఉందో అని తెలుసుకోడానికి వెతుకులాట అన్నది మొదలై ఇప్పటికే చాలా కాలం అయింది. 

ఖ‌గోళ ప‌రిశోధ‌కులు తాజాగా ఓ కీల‌క విష‌యాన్ని గుర్తించారు. మ‌నిషి మనుగడకు అనుకూలమైన‌ భూమిని మించిన 24  గ్రహాలను వారు క‌నిపెట్టారు. వాట‌న్నింటిలో జీవరాశి వృద్ధికి భూమి కన్నా మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించిన ఈ వివ‌రాల‌ను ఆస్ట్రాలజీ వెబ్‌ జర్నల్‌ ప్రచురించింది.

భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్ర‌హాల‌న్నీ ఉన్నాయని, భూమి కన్నా అవి పురాతనమైనవే కాకుండా ప‌రిమాణంలో పెద్దవిగా ఉన్నాయ‌ని అన్నారు. ఆ గ్ర‌హాల్లో భూమి కంటే వేడి వాతావరణం.. తేమ ఉందని అంటున్నారు. ఆయా గ్రహాలు తిరిగే కక్ష్యల‌కు ద‌గ్గ‌ర్లో ఉండే నక్షత్రాలు సూర్యుడి కన్నా మెరుగ్గా ఉన్నాయని.. వాటి జీవితకాలం కూడా సూర్యుడి కన్నా అధికమని చెబుతూ ఉన్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వాటిల్లో జీవరాశి సులభంగా వృద్ధి చెందుతుందని అంటున్నారు. 

ప్రస్తుతం మనుషుల దగ్గర ఉన్న అధునాతన టెక్నాలజీ ప్రకారం ఆయా గ్రహాలను చేరుకోవడం కుదరదు. ఈ విశాల విశ్వంలో మనిషి ఒక్కడే జీవి కాదని ఇప్పటికే చాలా మంది నమ్ముతూ ఉన్నారు. ఏదైనా గొప్ప టెక్నాలజీ అభివృద్ధి చెందితే తప్ప మనిషి ఆయా గ్రహాలకు చేరుకోవడం కుదరని పని..! ఉన్న భూమిని సర్వనాశనం చేసుకుంటున్న మానవుడు.. వేరే గ్రహాలలో బ్రతకచ్చో లేదో అంటూ అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నాడు. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle