వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-202113-01-2021 16:53:06 IST
2021-01-13T11:23:06.079Z13-01-2021 2021-01-13T11:18:18.289Z - - 17-01-2021

ఆన్లైన్ చాటింగ్‌లో ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ యాప్ వాట్సాప్ అని అందిరికీ తెలిసిందే. 2019లో 190 కోట్ల యూజర్లను వాట్సాప్ కలిగి ఉంది. రోజుకు కనీసం 60 బిలియన్ల సంఖ్యలో వాట్సాప్ మెసేజ్‌లు రికార్డవుతున్నాయి. వాట్సాప్‌ని ఫేస్ బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తులు పరస్పరం సులభంగా కమ్యూనికేట్ అయేందుకు వీలిస్తున్న ఉచిత యాప్ ఇది. భద్రతతోపాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సౌకర్యం ఉన్న ఉత్తమమైన యాప్ ఇది. టెక్స్ట్ మేసేజీలు, ఇమేజీలు, వీడియో ఫైల్స్ పంపుకోవడానికి, ఉచిత వాయిస్, వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్‌లు పంపుకోవడానికి వాట్సాప్ వీలుకల్పిస్తోంది. మీరు దీన్ని స్మార్ట్ పోన్ గానూ, డెస్క్ టాప్ కంప్యూటర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. ఈ మల్టీ ప్లాట్ ఫామ్ పీచర్స్ ఎంత విశిష్టమైన వంటే మీ డేటా మొత్తం మీ అన్ని డివైస్‌లలోనూ అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సప్ గతంలో కొన్ని ప్రైవసీ సమస్యలను కలిగి ఉండేది. ఇక ఫేస్ బుక్ విషయానికి వస్తే ఈ విషయంలో దానికి ఏమంత మంచి రికార్డు లేదు. పైగా చాలామంది యూజర్లు విస్తృతమైన ఫేస్ బుక్ ఎకో సిస్టమ్‌లో భాగం కావాలనుకోవడం లేదు. దీంతో వాట్సాప్‌కు అనేక ప్రత్యామ్నాయాలు రావడానకి దారి సుగమమైంది. పైగా వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త పాలసీపై యూజర్లు చాలా అసంతృప్తితో ఉంటున్నారని సమాచారం. ఎందుకంటే ఏ కంపెనీ అయినా తమ విధివిధానాల్లో మార్పులు చేస్తే వాటిని అంగీకరించాలా వద్దా అని ఎంపిక చేసుకోవడం వినియోగదారుల చేతుల్లోనే ఉండేది. కానీ ఫేస్ బుక్ అనుబంధ సంస్థగా ఉన్న వాట్సాప్ తాజా పాలసీలో యూజర్ల ఎంపికకు వీలు లేదు. వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త పాలసీని 2021 ఫిబ్రవరి 8 నుంచి ప్రతి యూజర్ తప్పకుండా ఆమోదించి తీరాల్సిందేనట. లేకుంటే ఆరోజునుంచి వాట్సాప్ ఖాతా పనిచేయదని సంస్థ స్వయంగా తేల్చిచెప్పేసింది. గోప్యత విషయంలో చాలా సున్నితంగా ఉంటున్న కోట్లాదిమంది వాట్సాప్ యూజర్లు దీంతో మండిపడుతున్నారు. దీంతో అందరూ వాట్సాప్‌కి ప్రత్యామ్నాయ యాప్‌లవైపు చూపు సారిస్తున్నారు. దీనికితోడు టెస్లా ఎలెక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ వాట్సాప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ దానికి పోటీగా ఉన్న సిగ్నల్ యాప్‌ని ఉపయోగించాలని పిలుపునిచ్చాడు. మస్క్ పిలుపుతో లక్షలాది మంది యూజర్లు ఇప్పటికే సిగ్నల్ యాప్ కోసం ప్రయత్నిచంచడంతో దరఖాస్తును ఒకే చేయటానికి ఓటీపీలను పంపించడంలో కూడా సిగ్నల్ చేతులెత్తేసింది. వాట్సాప్‌నే మించిపోయిన సిగ్నల్ యాప్ అత్యంత భద్రత, గోప్యతను యూజర్లకు అందిస్తున్న పాపులర్ చాటింగ్ యాప్ సిగ్నల్. మీకు అవసరం లేని మెసేజిలను తొలగించడానికి టైమర్‌ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది విశిష్టమైన ఫీచర్ మరి. వాట్సాప్ లాగే మీరు సిగ్నల్ యాప్ ద్వారా టెక్స్టు మెసేజ్‌లు పంపుకోవచ్చు. గ్రూప్ చాట్లు చేసుకోవచ్చు. ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. వీడియో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. సిగ్నల్ యాప్‌లో యూజర్లు 1.5 జీబీ సైజు ఉన్న ఫైల్స్‌ని కూడా పంపుకోవచ్చు. అలాగే ఒకే గ్రూప్‌లో 2 లక్షలమందిని యాడ్ చేయవచ్చు. అన్ని ఓఎస్లనూ సపోర్ట్ చేసే సిగ్నల్ ఇప్పుడు వాట్సాప్ ప్రత్యామ్నాయ యాప్‌గా దూసుకుపోతోంది. కొద్దిరోజుల క్రితం వరకు జర్నలిస్టులు, విద్యావేత్తలు, పరిశోధకులు మాత్రమే సిగ్నల్ యాప్‌ని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఎలాన్ మస్క్ పిలుపుతో సిగ్నల్ యాప్ డౌన్ లోడ్లు పెరిగిపోయాయి. వాట్సాప్ తరహాలోనే దీంట్లో కూడా డిసప్పియరంగ్ మెసేజెస్, స్క్రీన్ లాక్, గ్రూప్ చాట్ సెక్యూరిటీ, వీడియా/ఆడియో కాల్ ఫీచర్స్ ఉన్నాయి. పైగా అన్ని రకాల డివైజ్‌లను సపోర్ట్ చేసే సిగ్నల్ యాప్ యూజర్ ఫోన్ నంబర్ మినహా మరే ఇతర వివరాలను సేకరించదు. గత వారం 40 కోట్ల మంది వాట్సాప్ ఇండియన్ యూజర్లకు తమ కొత్త పాలసీ మార్పులను అంగీకరించాల్సిందిగా వాట్సాప్ నోటిఫికేషన్ పంపించింది. వాట్సాప్ ఉపయోగిస్తున్న ప్రతి ఇద్దరు భారతీయ యూజర్లలో ఒకరు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా సిగ్నల్ యాప్‌కి మారిపోతామని చెప్పారు. దీంతో వాట్సాప్ వద్దనుకునే యూజర్లకు అందుబాటులో 21 యాప్‌లు ఉంటున్నాయని సమాచారం. వీటిలో మరీ అయిదు యాప్‌లు వాట్సాప్ తో పోటీ పడుతున్నాయి. వీటిలో టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal), వైబర్ (Viber), థీమా (Threema), ఎలిమెంట్ (Element) అనే యాప్‌లు ఉన్నత ప్రమాణాలతో, పలు సౌకర్యాలతో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లు ఇప్పటికే బహుళ జనాదరణ పొందాయి.

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021

వెనక్కు తగ్గిన వాట్సాప్
12-01-2021

కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్
11-01-2021

ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్
08-01-2021

పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!
06-01-2021

5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్
04-01-2021

ఫౌజీ ట్రైలర్ వచ్చేసింది.. గేమ్ వచ్చేదెప్పుడంటే..!
03-01-2021
ఇంకా