చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్
27-11-202027-11-2020 19:43:20 IST
2020-11-27T14:13:20.480Z27-11-2020 2020-11-27T14:13:16.773Z - - 16-01-2021

ఆస్ట్రేలియా సిరీస్ ను భారత జట్టు ఓటమితో మొదలు పెట్టింది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 90 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 76 బంతులాడిన పాండ్య 7 ఫోర్లు, 4 సిక్సులతో అలరించాడు. ధావన్ (74) పరుగులతో రాణించాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజెల్ వుడ్ టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీశాడు. హేజెల్ వుడ్ ధాటికి మయాంక్ అగర్వాల్ (22), కెప్టెన్ విరాట్ కోహ్లీ (21), శ్రేయాస్ అయ్యర్ (2) పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114), స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో ఆకట్టుకున్నారు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు బాదిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెత్త రికార్డును అందుకున్నాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత స్పిన్నర్ గా రికార్డును అందుకున్నాడు. 10 ఓవర్లలో చాహల్ 89 పరుగులు ఇచ్చాడు. అంతకు ముందు కూడా ఈ చెత్త రికార్డు చాహల్ పేరు మీదనే ఉండేది. 2019 లో వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు మీద చాహల్ 88 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. 2015 లో సౌత్ ఆఫ్రికా జట్టు భువనేశ్వర్ బౌలింగ్ లో 106 పరుగులు సాధించింది. మొదటి వన్డేలో స్టోయినిస్ ను చాహల్ గోల్డెన్ డక్ గా పంపించగా.. ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా పరుగులు పిండుకున్నారు.

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
an hour ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
8 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!
13-01-2021
ఇంకా