newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

సాహా ఫిట్‌.. పంత్ క‌ష్టాలు మొద‌లు..!

19-11-202019-11-2020 12:44:45 IST
2020-11-19T07:14:45.050Z19-11-2020 2020-11-19T07:14:42.114Z - - 29-11-2020

సాహా ఫిట్‌.. పంత్ క‌ష్టాలు మొద‌లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అపార‌మైన ప్ర‌తిభ యంగ్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ సొంతం. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని వార‌సుడిగా ఎంత వేగంగా దూసుకొచ్చాడో అంతే వేగంగా వెనక్కి వెళ్లాడు‌. కెప్టెన్‌, కోచ్ త‌నపై ఎంతో న‌మ్మ‌కం ఉంచి ప‌దే ప‌దే అవ‌కాశాలు ఇచ్చినా.. చెత్త షాట్ల‌తో పెవిలియ‌న్ చేర‌డంతో.. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో పంత్‌కు ప్ర‌స్తుతం దారులు మూసుకుపోయాయి. కేఎల్ రాహుల్ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లో అదర‌గొడుతున్నాడు. సంజు శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్ వంటి యువ‌కుల రాకతో వ‌న్డేల్లో, టీ20ల్లో పంత్‌కు ఇప్ప‌ట్లో చోటు ద‌క్క‌డం క‌ష్టం. 

ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌తో పోలీస్తే టెస్టుల్లో పంత్ ప‌రిస్థితి కాస్త బెట‌ర్‌. టెస్టుల్లో పంత్‌కు ప్ర‌స్తుతం వృద్ధిమాన్ సాహాతో మాత్ర‌మే పోటి ఉంది. అత‌డు ఫిట్‌గా లేకుంటే.. పంత్‌కు అవ‌కాశం ద‌క్కుతూ వ‌స్తోంది. మ‌హా అయితే.. ఇంకో రెండేళ్లు మాత్ర‌మే సాహా ఆడే అవ‌కాశం ఉండ‌డంతో టెస్టు జ‌ట్టులో త‌న ప్లేస్‌కు సుస్థిరం చేసుకోవాల‌ని పంత్ బావిస్తున్నాడు. ఆసీస్‌తో టీమ్ఇండియా నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది. క‌నీసం ఒక్క టెస్టులోనైనా జ‌ట్టులో చోటు ద‌క్కుతుంద‌ని పంత్ ఆశ‌గా ఎదురుచూస్తున్నాడు. 

 ఐపీఎల్‌లో ఆడుతూ గాయ‌ప‌డ్డాడు వృద్దిమాన్ సాహా. అయితే.. ఆసీస్‌తో టెస్టు సిరీస్ క‌ల్లా అత‌ను కోలుకుంటాడ‌ని బావించిన సెల‌క్ట‌ర్లు అత‌డికి ఆస్ట్రేలియాతో సిరీస్ ఎంపిక చేశారు. అయితే.. సిరీస్ ప్రారంభానికే ముందే సాహా కోలుకున్నాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న సాహా ఎట్టకేలకి ఫిట్‌నెస్ సాధించాడు. సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ మైదానంలో బుధవారం సాహా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. భారత సహాయక సిబ్బంది త్రో బంతులు విసరగా.. చక్కగా బ్యాటింగ్ చేశాడు. సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఈ రోజు నెట్స్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారో చూడండి' అని బీసీసీఐ కాప్షన్ పెట్టింది.

అయితే.. వృద్దిమాన్ సాహా ఫిట్‌నెస్ సాధించ‌డంతో.. రెండో వికెట్ కీప‌ర్‌గా ఎంపికైన రిష‌బ్ పంత్‌కు షాక్ త‌గ‌ల‌నుంది. ఈ సిరీస్‌లో అతడు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. క‌నీసం ఒక్క టెస్టులోనైనా అవ‌కాశం వ‌స్తుంద‌ని పంత్ బావించ‌గా.. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   11 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   15 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   17 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   18 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle