newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!

29-09-202029-09-2020 10:50:02 IST
Updated On 29-09-2020 10:57:12 ISTUpdated On 29-09-20202020-09-29T05:20:02.584Z29-09-2020 2020-09-29T05:19:57.987Z - 2020-09-29T05:27:12.121Z - 29-09-2020

ఇషాన్ కిషన్ సూపర్ ఓవర్ ఆడడానికి ఎందుకు రాలేదో చెప్పిన రోహిత్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా సాగింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడగా.. సూపర్ ఓవర్ లో విజయం కోహ్లీ సేనను వరించింది. 

సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా, రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల టార్గెట్  ఇచ్చింది. 

ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. మొదటి రెండు బంతులు.. ఒక్కో పరుగు తీయగా.. మూడో బంతి డాట్ బాల్ అయింది. బుమ్రా మ్యాజిక్ చూడొచ్చని భావించగా.. నాలుగో బంతిని ఫోర్ కొట్టాడు ఏబీడీ.. ఐదో బంతి కాస్తా సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ముంబై తరపున సూపర్ ఓవర్ ఆడడానికి రాలేదు. అందుకు కారణాన్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వివరించాడు. ఇషాన్ కిషన్ అప్పటికే అలసిపోయాడని వెల్లడించాడు రోహిత్. రోహిత్ మాట్లాడుతూ 'మ్యాచ్ ఎంతో అద్భుతంగా సాగింది. మా ఇన్నింగ్స్ మొదట్లో మ్యాచ్ అసలు మా చేతుల్లోనే లేదు. ఇషాన్ కిషన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఎప్పటిలాగే పొలార్డ్ కూడా మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. పొలార్డ్ క్రీజులో ఉన్నంత వరకూ ఎలాంటి మ్యాచ్ అయినా గెలవగలం. ఇషాన్ కూడా మంచి షాట్స్ ఆడుతూ వెళ్ళాడు. ఇషాన్ ఒత్తిడిని అధిగమిస్తూ ఆడుతూ వచ్చాడు. కిషన్ అలసిపోయినందుకే సూపర్ ఓవర్ ఆడడానికి రాలేకపోయాడు. హార్దిక్ మీద నమ్మకంతోనే సూపర్ ఓవర్ ఆడడానికి పంపించాం' అని చెప్పుకొచ్చాడు. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle