newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

01-03-202101-03-2021 15:53:56 IST
Updated On 01-03-2021 15:56:34 ISTUpdated On 01-03-20212021-03-01T10:23:56.164Z01-03-2021 2021-03-01T10:23:50.874Z - 2021-03-01T10:26:34.575Z - 01-03-2021

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ భారత క్రికెట్ మైదానాల్లో పిచ్‌ నాణ్యతపై సాగుతున్న చర్చ చేయి దాటిపోతోందంటూ విమర్శకులపై మండిపడిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ సైతం ఇదే తరహాలో స్పందించాడు. పిచ్‌ స్పిన్నింగ్స్‌కు అనుకూలంగా మారినప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరు ఏడుపు మొదలెట్టేశారు అని కౌంటర్‌ ఇచ్చాడు.

ప్రపంచవ్యాప్తంగా పలుమైదానాల్లో స్పిన్ తిరిగే పిచ్‌లపై తాము ఆడామని, ఒక్కోసారి 50, 60 పరుగులకే తమ జట్టుకూడా కుప్పగూలిపోయిందని కానీ ఎవరూ దానిగురించి మాట్లాడలేదని నాథన్ లియోన్ దుయ్యబట్టారు. ఎప్పుడైతే మైదానంలో పిచ్ స్పిన్‌కి అనువుగా మారుతుందో ప్రపంచంలో ప్రతి వాడు దాన్ని గురించి ఏడుపు మొదెలుడుతన్నారు. వీరి ఏడుపులతో నాకు పనిలేదు. వాటిని నేను పట్టించుకోను, పిచ్ స్పిన్‌కు అనుకలమైతే అది ప్రేక్షకులను మరింతగా ఆనందింపిజేస్తుంది అని లియోన్ వ్యాఖ్యానించారు.

అహమ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు రెండో రోజు మ్యాచ్‌ను ఆరోజు రాత్రంతా మేల్కొని మరీ చూశాను. నిజంగా ఆ పిచ్ అద్భుతమైనది. మా సిడ్నీ క్రికెట్ స్టేడియంకి కూడా మొతేరా పిచ్ ను తయారుచేసిన క్యురేటర్‌ని తీసుకువస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను అని ఆసీస్ స్పిన్ బౌలర్ నాథన్ లియోన్ చెప్పాడు. 

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించిన నాటి నుంచి ఇంగ్లిష్‌ మీడియా ఇదేం పిచ్ అంటూ కామెంట్లు చేస్తోంది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ఇప్పటికే.. ‘‘ఇది ఐదు రోజుల టెస్టు పిచ్‌ కాదు’’ అంటూ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.  

ఇండియాకు వెళ్తున్నారు అంటేనే స్పిన్‌ లాండ్‌కు వెళ్తున్నామని లెక్క.. రిచ్చర్డ్స్ 

ఇండియాకు వెళ్తున్నారు అంటేనే స్పిన్‌ లాండ్‌కు వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. అంతేతప్ప పిచ్‌ గురించి చింతించడం మానేయాలి అంటూ వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్ పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడం తనకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు పిచ్‌ గురించి మాట్లాడటం మానేయాలని, స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై పర్యాటక జట్టు దృష్టి సారించాలని హితవు పలికాడు.

రెండు రోజుల్లోనే మూడో టెస్టు ముగిసింది. కాబట్టి పిచ్‌ను అంచనా వేసేందుకు ఇంగ్లండ్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది. నాలుగో టెస్టు ఎలా ఉండబోతోందో అర్థమయింది. నేనైతే ఆఖరి టెస్టు మ్యాచ్‌కు కూడా అదే పిచ్‌ తయారుచేయాలని కోరుకుంటున్నా అని రిచర్డ్స్‌ పేర్కొన్నాడు. 

నాలుగో టెస్టుకు కూడా సేమ్‌ పిచ్‌ను తయారు చేయాలని ఇండియాకు విజ్ఞప్తి చేశాడు. మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు ఆరంభం కానుంది.

ఇప్పటికే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సీరీస్‌లో 2-1 తో ఆధిక్యత సాధించిన భారత్ మార్చి 4నుంచి మొదలు కానున్న నాలుగో టెస్టును గెలిచినా లేక డ్రా చేసుకున్నా  నేరుగా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ న్యూజిలాండ్ తో లార్డ్స్ మైదానంలో తలపడటానికి అర్హత సాధిస్తుంది

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle