newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!

08-04-202108-04-2021 15:42:07 IST
2021-04-08T10:12:07.938Z08-04-2021 2021-04-08T02:48:44.700Z - - 20-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ కు కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉండగా.. మరో వైపు స్థానికులు తమకు మ్యాచ్ లే అవసరం లేదని అంటూ ఉన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ అక్కడి చుట్టుపక్కల ప్రజలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు లేఖ రాశారని ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రచురించింది. ఐపీఎల్‌కు భారీ ఆదరణ ఉన్న నేపథ్యంలో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ప్రజలు స్టేడియం చుట్టుపక్కల గుమిగూడే ప్రమాదం ఉందని లేఖలో తెలిపారు. కరోనా‌ విజృంభణ నేపథ్యంలో వివాహాలు, అంత్యక్రియల వంటి కార్యక్రమాలపై సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఎలా అనుమతించారని మెరైన్‌ డ్రైవ్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక వాంఖడేలో ఎలాగైనా మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ ఓ వైపు భావిస్తూనే ఉంది. మరో వైపు తరలించే అవకాశాలు చాలా తక్కువ అని కూడా అంటున్నారు. 

మహారాష్ట్రలో కరోనా కేసుల విషయంలో కేంద్రం కూడా మరో వైపు ఆందోళన వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్రలో మరో మూడు రోజుల్లో వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తయిపోతాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతూ ఉన్నాయి.  కేంద్రం వీలైనంత త్వరగా మరిన్ని డోసులు అందజేయాలని..  లేదంటే ముంబయి వంటి నగరాల్లో టీకా కేంద్రాలను మూసివేయాల్సి వస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని, ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. తన మౌనాన్ని బలహీనతగా భావించకూడదు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తోంది. రాజకీయాలు చేయడం చాలా సులభం. కానీ, పాలన, వైద్యారోగ్య మౌలిక వసతుల్ని మెరుగుపరచడమే నిజమైన పరీక్ష అని హర్షవర్ధన్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైందని అన్నారు. సంస్థాగత క్వారంటైన్‌ నుంచి ప్రజల్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని అన్నారు. ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతోందని అన్నారు. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle