ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!
13-01-202113-01-2021 12:34:23 IST
Updated On 13-01-2021 13:22:25 ISTUpdated On 13-01-20212021-01-13T07:04:23.815Z13-01-2021 2021-01-13T07:04:11.865Z - 2021-01-13T07:52:25.290Z - 13-01-2021

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్ లో అడుగుపెట్టినప్పటి నుండి గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలిగారు. మూడో టెస్ట్ తర్వాత ఏకంగా నలుగురు భారత ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. దీంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారతజట్టుకు 11 మంది కూడా లేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆస్ట్రేలియా సిరీస్ కు తాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ సరదాగా చెప్పుకొచ్చాడు. 'టీమిండియా గాయాలతో సతమతమవడం నేను చూడలేకపోతున్నా. షమీ, ఉమేశ్, రాహుల్, జడేజా, విహారి, బుమ్రా ఇలా ఒకరి తర్వాత ఒకరు గాయపడడంతో సగం జట్టు ఖాళీ అయింది. ఒకవేళ 11 మందిలో ఇంకా ఎవరు ఫిట్‌గా లేకున్నా వారి స్థానంలో నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నా..ఇప్పుడే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్దం.. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందేమో' అని వీరూ ట్వీట్ చేశాడు. వీరూ ట్వీట్ చేయడానికి కారణం కూడా పెద్దదే.. ఎందుకంటే వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతూనే ఉన్నారు. ప్రధాన బౌలర్ బుమ్రా, మయాంక్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో ఆడడం అనుమానమే. హనుమ విహారి కూడా గాయపడ్డాడు. చెత్త ఫామ్ లో ఉన్న పృథ్వీషాకు తర్వాతి మ్యాచ్ లో భారత్ మరో అవకాశం ఇవ్వనుంది. ఇక కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ను టెస్ట్ మ్యాచ్ ఆడించాల్సి వచ్చింది. రెండు టెస్ట్ మ్యాచ్ ల అనుభవం మాత్రమే ఉన్న సిరాజ్ పేస్ బౌలింగ్ కు సారథ్యం వహించాల్సి వస్తోంది. ఒకే మ్యాచ్ అనుభవమున్న సైనీ అతడికి తోడుగా ఉండనున్నాడు. మూడో పేస్ బౌలర్ కావాలంటే నటరాజన్ కు తప్పకుండా అవకాశం దక్కనుంది. ఈ సిరీస్ ఎంతో అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను ఆసీస్ జట్టు, టీ-20 సిరీస్ ను ఇండియా గెలుచుకున్నాయి. అత్యంత కీలకమైన టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ముగియగా, చెరో మ్యాచ్ ని రెండు జట్లూ గెలుచుకుని, ఒక మ్యాచ్ ని డ్రాగా ముగించాయి. దీంతో 1-1 తో ప్రస్తుతానికి సిరీస్ సమంగా ఉంది. ఇక నాలుగో మ్యాచ్ 15వ తేదీన బ్రిస్బేన్ లో జరుగనుంది. భారత్ ఆడించే 11 మంది ఆటగాళ్ల విషయంలో ఎంతో ఆసక్తి నెలకొంది.

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్
7 hours ago

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
8 hours ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
15 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021
ఇంకా