newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

10-05-202110-05-2021 15:17:30 IST
Updated On 10-05-2021 18:34:10 ISTUpdated On 10-05-20212021-05-10T09:47:30.879Z10-05-2021 2021-05-10T09:36:01.990Z - 2021-05-10T13:04:10.580Z - 10-05-2021

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ ను కోహ్లీ నేడు వేయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను కోహ్లీ పోస్టు చేశాడు. టీకా వేసుకుంటున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కోహ్లీ.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరాడు. తమ వంతు రాగానే ఆలస్యం చేయకుండా టీకా తీసుకోవాలన్నాడు. పలువురు క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. 

Virat Kohli receives dose of covid 19 vaccine share photo on social media| Virat  Kohli ने लगवाया COVID 19 का टीका, इंस्टाग्राम पर शेयर की ये Photo| Hindi  News

టీమిండియా వెటరన్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ క్రికెటర్‌ పీయూష్‌ చావ్లా తండ్రి ప్రమోద్‌ కుమార్‌ చావ్లా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్‌ చావ్లా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తన తండ్రి ఫొటోను ఇందుకు జత చేసిన పీయూష్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాల్సిందిగా కోరాడు. పియూష్‌ చావ్లా తండ్రి మృతి పట్ల చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా సంతాపం ప్రకటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు.

కరోనా కారణంగా పలువురు క్రికెటర్ల కుటుంబాల్లో కూడా విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే..! రాజస్థాన్ రాయల్స్ తరపున ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొట్టిన యువ ఆటగాడు చేతన్ సకారియా తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. చేతన్ సకారియా తండ్రి కాంజీభాయ్ సకారియా కరోనా కారణంగా కన్నుమూశాడు. గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ లో చేతన్ సకారియా తండ్రి కాంజీభాయ్ కరోనాకు చికిత్స తీసుకుంటూ మరణించాడు.

ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. చేతన్ సకారియాతో తాము టచ్ లోనే ఉన్నామని.. అతడి కుటుంబానికి అండగా నిలుస్తామని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలిపింది. భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ అయిన వేదా కృష్ణమూర్తి కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి, సోదరి కరోనాతో కన్ను మూశారు. అది కూడా కేవలం రెండు వారాల వ్యవధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

   10 hours ago

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

   13-06-2021

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

   12-06-2021

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

   11-06-2021

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

   10-06-2021

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

   10-06-2021

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

   09-06-2021

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

   08-06-2021

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

   07-06-2021

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

   06-06-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle