newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

విరాట్.. ఆ ఆటేమిటో..!

28-09-202028-09-2020 22:35:59 IST
Updated On 29-09-2020 07:00:11 ISTUpdated On 29-09-20202020-09-28T17:05:59.942Z28-09-2020 2020-09-28T17:05:56.157Z - 2020-09-29T01:30:11.802Z - 29-09-2020

విరాట్.. ఆ ఆటేమిటో..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విరాట్ కోహ్లీ.. గ్రౌండ్ లో అడుగుపెడుతున్నాడు అంటే చాలు.. వేటాడే సింహం బ్యాటింగ్ చేయడానికి వచ్చినట్లు ఉండేది. ఆ కాన్ఫిడెన్స్.. ఆ కళ్ళల్లో కసి.. అది చూడడానికే టీవీలకు అతుక్కుపోయే వారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ మొదలైనప్పటి నుండి కోహ్లీ ఆట తీరులో కసి అసలు కనిపించలేదు. 

విరాట్‌ కోహ్లి రాణిస్తాడనే ఆశతో ఉన్న ఆర్సీబీ అభిమానులకు మూడు ఇన్నింగ్స్ లలో నిరాశ ఎదురైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో  మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన కోహ్లి.. కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక పరుగే చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కూడా కోహ్లి ఘోరంగా విఫలమయ్యాడు. 11 బంతులు ఆడి 3 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన దగ్గర్నుంచి ఇబ్బందులు పడుతూ కనిపించిన కోహ్లీ   చివరకు నిరాశపరిచాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ ముంబైకి ఆ నిర్ణయం కలిసి రాలేదు.  బెంగళూరు బ్యాట్స్మెన్ బాగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో  3 వికెట్లకు 201 పరుగులు చేసింది.ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 54 (5 ఫోర్లు, 2 సిక్స్ లు), మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 52 (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు సాధించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్ కు 81 పరుగులతో శుభారంభం అందించాడు. చివర్లో ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్ లు), శివం దూబే (10 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్ లు) ధాటిగా ఆడడంతో బెంగళూరు స్కోరు 200 దాటింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, రాహుల్ చహర్ ఓ వికెట్ సాధించారు.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle