newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోహ్లీ జాగ్రత్త..!

10-04-202110-04-2021 13:44:11 IST
Updated On 10-04-2021 09:02:59 ISTUpdated On 10-04-20212021-04-10T08:14:11.506Z10-04-2021 2021-04-10T02:37:58.076Z - 2021-04-10T03:32:59.114Z - 10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ లో భారత క్రికెట్ అభిమానులు వేరు.. వేరు ఫ్రాంచైజీలకు సపోర్ట్ చేసిప్పటికీ.. భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీ అయ్యాక ఎలాగూ.. భారతజట్టు ఇతర దేశాలతో టోర్నమెంట్లు ఆడాల్సి ఉంటుంది. అందుకే భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుందని ఆశిస్తారు. ఇక ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు గాయాల పాలవ్వడాన్ని కూడా భారత అభిమానులు అసలు తట్టుకోరు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీకి గాయమవ్వడం అభిమానులను టెన్షన్ పెట్టింది. 

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. 19వ ఓవర్ తొలి బాల్ ను వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కృనాల్ పాండ్యా కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కోహ్లీ కంటి దగ్గర బాల్ తాకింది. తొలుత చేతిని తాకిన బాల్, ఆపై నుదుటిపై కుడికన్ను సమీపంలో తాకింది. ఆపై కోహ్లీ కొన్ని క్షణాలు విలవిల్లాడినా, తన జట్టు గెలుపు కోసం మైదానాన్ని వీడలేదు. కోహ్లీ ముఖంపై తగిలిన దెబ్బ కారణంగా, అతని కన్ను ఎర్రగా మారిపోయింది. కంటి నుంచి నీరు కారుతూ కూడా కనిపించింది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపు కంటి కింద ఐస్ కూడా పెట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత పెవిలియన్ కు వెళ్లిన కోహ్లీ, ఆపై ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చాడు. కోహ్లీ కన్ను ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారుతున్న ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

ముంబై ఇండియన్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి బంతి వరకూ మ్యాచ్ సాగింది.  విజయం ఆర్సీబీనే వరించింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కు 2 వికెట్ల పరాజయం తప్పలేదు. సీజన్ తొలిసమరంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా 160 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్ ఆఖరు బంతికి విజయాన్ని అందుకుంది. 5 వికెట్లను తీసిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle