newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

15-04-202115-04-2021 15:48:51 IST
Updated On 15-04-2021 14:18:27 ISTUpdated On 15-04-20212021-04-15T10:18:51.375Z15-04-2021 2021-04-15T08:41:51.622Z - 2021-04-15T08:48:27.443Z - 15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో దిగజారాడు. విరాట్ కోహ్లీ రెండో స్థానానికి రావడం 2017 తర్వాత ఇదే తొలిసారి.  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి స్థానాన్ని చేరుకున్నాడు, కోహ్లీ రెండో ప్లేస్ కు పరిమితం అయ్యాడు. ప్రస్తుతం బాబర్ ఆజమ్ ఖాతాలో 865 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న కోహ్లీకి 857 పాయింట్లు ఉన్నాయి.  26 ఏళ్ల వయసులో ఉన్న బాబర్ ఆజమ్, 2015 నుంచి వన్డే క్రికెట్ ఆడుతున్నాడు.

తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన పోటీలో 94 పరుగులు చేసిన తరువాత బాబర్ ఆజమ్ మొదటి స్థానానికి వచ్చాడు. 1,258 రోజుల నుంచి టాప్ ర్యాంక్ లో పదిలంగా ఉన్న విరాట్ కోహ్లీ, కిందకు దిగాల్సి వచ్చింది. రోహిత్ శర్మ 3వ స్థానంలో (825 పాయింట్లు), రాస్ టేల్ నాలుగో స్థానంలో (801 పాయింట్లు), ఆరోన్ ఫించ్ ఐదో స్థానంలో (791 పాయింట్లు) ఉన్నారు. 80 వన్డేలు మాత్రమే ఆడిన బాబర్ ఆజమ్ 3,808 పరుగులు సాధించడం విశేషం. ఇందులో 13 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 56.38గా ఉంది. టెస్టుల విషయానికి వస్తే, గతంలో కెరీర్ బెస్ట్ గా ఐదో ర్యాంకు వరకూ వచ్చిన బాబర్ ఆజమ్, ప్రస్తుతం ఆరో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీ-20ల్లో బాబర్ ఆజమ్ మూడవ ర్యాంకులో ఉన్నాడు.

బాబర్ ఆజమ్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 59 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టి20ల్లో ఆజమ్‌కి తొలి శతకమిదే. అంతర్జాతీయ టి20ల్లో వేగంగా శతకం కొట్టిన పాక్‌ బ్యాట్స్‌మన్‌గా... టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన పాక్‌ బ్యాట్స్‌మన్‌గా ఆజమ్‌ గుర్తింపు పొందాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 18 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 205 పరుగులు సాధించి గెలిచింది.బాబర్‌ ఆజమ్‌ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 17.4 ఓవర్లలో 197 పరుగులు జోడించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. జానెమన్‌ మలాన్‌ (40 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (31 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు 108 పరుగులు జత చేశారు. సిరీస్‌లోని చివరిదైన నాలుగో టి20 మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది.  

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle