newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

02-03-202102-03-2021 13:05:19 IST
2021-03-02T07:35:19.457Z02-03-2021 2021-03-02T07:35:10.657Z - - 11-04-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో సెంచరీ కొట్టి చాలా రోజులే అయింది.. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం సెంచరీ కొట్టేశాడు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్.. ఇలా సామాజిక మాధ్యమాల్లో కోహ్లీని ఫాలో అయ్యే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. 

సోషల్ మీడియాలోనూ తనకి తిరుగులేదని నిరూపించాడు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్‌కి చేరింది. భారత్‌ తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. సోమవారం నాటికి ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. భారత సెలెబ్రిటీలలో ప్రియాంక చోప్రా ఫాలోయర్ల సంఖ్య 60 మిలియన్‌కాగా.. దీపికా పదుకొణె‌ని 53.3 మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇన్‌స్టా‌గ్రామ్‌లో 51.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.వీరందరికంటే ముందు వరుసలో కోహ్లీ ఉన్నాడు. 

100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న మొదటి క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర లిఖించగా.. ఫుట్ బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్‌), లియోనెల్‌ మెస్సీ (184 మిలియన్‌), నేమార్‌ (147 మిలియన్‌) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లీనే కావడం విశేషం. 100 మిలియన్‌ ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి ఆసియా వ్యక్తిగా విరాట్‌ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. కోహ్లీ సాధించిన ఈ రికార్డు పట్ల అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐసీసీ కూడా కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పింది. 

మరో వైపు కోహ్లీ మైదానంలో ఎన్నో రికార్డులను బద్దలుకొడుతున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో విజయం సాధించడంతో విరాట్ మాజీ వెటరన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు . ఈ రికార్డు కెప్టెన్‌గా సొంతగడ్డపై అత్యధిక టెస్ట్ విజయం కావడం విశేషం. ధోనీ స్వదేశంలో 30 టెస్ట్ లకు సారథ్యం వహించి 21 మ్యాచ్ లు గెలిపించగా.. కోహ్లీ 29 మ్యాచ్ ల్లో 22 విజయాలను అందుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో మొదటి స్థానంలోకి వెళ్లడానికి కోహ్లి.. కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. కానీ కోహ్లీ మైదానంలో సెంచరీ కొట్టి చాలా రోజులే అవుతోంది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle