newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

15-04-202115-04-2021 12:08:39 IST
Updated On 15-04-2021 09:23:47 ISTUpdated On 15-04-20212021-04-15T06:38:39.176Z15-04-2021 2021-04-15T03:50:40.909Z - 2021-04-15T03:53:47.691Z - 15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నైలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మంచి ఇన్నింగ్స్ ఆడాలని అనుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో కోహ్లీకి మంచి ఆరంభం లభించింది. 29 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హోల్డర్ బౌలింగ్ లో విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.   తన జట్టు స్కోరు వేగం పెంచాలన్న ఉద్దేశంతో 12వ ఓవర్ ఒకటో బంతికి భారీ షాట్ ను ఆడిన కోహ్లీ, లాంగ్ లెగ్ లో ఉన్న విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో కోపంతో పెవిలియన్ కు వెళ్ళిపోయాడు కోహ్లీ.

అక్కడ చోటు చేసుకున్న ఘటన కారణంగా విరాట్ కోహ్లీ రిఫరీ మందలింపునకు గురయ్యాడు. కోహ్లీ అడ్వర్టయిజ్ మెంట్ కుషన్ ను, అక్కడే ఉన్న కుర్చీని కాలితో తన్నుతూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటనపై లెవల్ 1 అభియోగాలను నమోదు చేసిన రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టి, కోహ్లీని మందలింపుతో సరిపెట్టాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ముంబై ఇండియన్స్ ఎలా షాక్ ఇచ్చిందో.. అచ్చం అలాగే సన్ రైజర్స్ కు ఆర్సీబీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌ 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓడింది.  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్సర్లు), కెప్టెన్‌ కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ (3/30), రషీద్‌ ఖాన్‌ (2/18) విజృంభించడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయలేకపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌ వార్నర్‌ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్సర్‌), మనీశ్‌ పాండే (39 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం చెందడంతో ఓటమిని చవి చూసింది. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle