newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

28-11-202028-11-2020 12:09:11 IST
Updated On 28-11-2020 12:28:32 ISTUpdated On 28-11-20202020-11-28T06:39:11.063Z28-11-2020 2020-11-28T06:39:03.985Z - 2020-11-28T06:58:32.348Z - 28-11-2020

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆస్ట్రేలియా టూర్ ను భారత్ పరాజయంతో మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 90 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 76 బంతులాడిన పాండ్య 7 ఫోర్లు, 4 సిక్సులతో అలరించాడు. ధావన్ (74) పరుగులతో రాణించాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజెల్ వుడ్ టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీశాడు.

హేజెల్ వుడ్ ధాటికి మయాంక్ అగర్వాల్ (22), కెప్టెన్ విరాట్ కోహ్లీ (21), శ్రేయాస్ అయ్యర్ (2) పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114),  స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో ఆకట్టుకున్నారు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు బాదిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత జట్టు ఓటమికి ముఖ్యంగా ఫీల్డింగ్ లో పొరపాట్లు, టాప్ ఆర్డర్ లో చెత్త షాట్లు ఆడడమని స్పష్టంగా తెలుస్తోంది. 

పరాజయం అనంతరం భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొదటి వన్డేలో పలు క్యాచ్‌లను వదిలేయడమే తమ పరాజయానికి కారణమన్నాడు. ఆసీస్‌ వంటి పటిష్టమైన జట్టుపై క్యాచ్‌లు వదిలేస్తే ఫలితం ఇలానే ఉంటుందని అసహనం వ్యక్తం చేశాడు. మేము దారుణంగా ఫీల్డింగ్‌ చేశాం. ఏదో అలసిపోయినట్లు ఫీల్డింగ్‌ తప్పిదాలు చేశామన్నాడు. 25 ఓవర్ల తర్వాత మా ఫీల్డింగ్‌ చాలా నిరాశపరిచింది.  ఒక నాణ్యమైన జట్టుతో ఆడేటప్పుడు ఫీల్డింగ్‌ అనేది చాలా ముఖ్యం. ఫీల్దింగ్‌ సరిగా చేయకపోతే ఒక మంచి జట్టు చేతిలో ఇలాంటి పరాభవమే ఎదురవుతుందని అన్నాడు. హార్దిక్‌ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఇంకా ఫిట్‌గా లేడని.. ఆరవ బౌలర్ కు సంబంధించిన లోటు గురించి చెప్పుకొచ్చాడు కోహ్లీ. రెండో వన్డే ఆదివారం నాడు జరుగుతుంది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఇప్పటికే 0-1 తో వెనుకబడి ఉంది. వన్డే సిరీస్ లో నిలిచి ఉండాలంటే ఆదివారం మ్యాచ్ లో భారతజట్టు గెలిచితీరాలి.

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

   an hour ago


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

   5 hours ago


గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

   8 hours ago


ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

   6 hours ago


ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

   27-01-2021


మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

   26-01-2021


కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

   25-01-2021


టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

   25-01-2021


ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

   24-01-2021


ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

   24-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle