newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

13-01-202113-01-2021 16:12:59 IST
Updated On 13-01-2021 16:38:02 ISTUpdated On 13-01-20212021-01-13T10:42:59.467Z13-01-2021 2021-01-13T10:41:07.862Z - 2021-01-13T11:08:02.547Z - 13-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో సెలెబ్రిటీలను కెమెరా కన్నులు ఎంతగా వెంటాడుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్రికెటర్లు, సినిమా స్టార్స్ ను వెంటపడుతూ.. వెంటపడుతూ.. ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇంటి నుండి బయటకు వచ్చినా, ఎయిర్ పోర్టులో కనిపించినా.. ఎక్కడికైనా కార్ లో వెల్తూ ఉన్నా.. ఇలా పలువురు ప్రముఖులను ఫోటోలు తీయడమే కొందరి పని. ఇలా ప్రతి ఒక్కటీ కెమెరాలో బంధిస్తూ ఉంటే.. ఏ సెలెబ్రిటీకి అయినా కోపం వస్తుంది. కొందరు వద్దని వారిస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఏదీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు ఇటీవలి కాలంలో ప్రైవసీ అన్నది లేకుండా పోయింది. ఎక్కడో కూర్చొని ఉన్నా కూడా కెమెరాలలో ఈ జంటను బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనుష్క గర్భవతిగా ఉన్న సమయంలో కూడా చాలా మంది ఫోటో జర్నలిస్టులు వారి అనుమతి లేకుండా ఫోటోలను తీశారు. 

సోమవారం అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  ఇప్పుడు పుత్రికోత్సాహంలో ఉన్నారు. తమకంటూ కొంత ప్రైవసీ కావాలంటూ విరాట్, అనుష్కలు కోరుతున్నారు. తమ ఫొటోలు ఫర్వాలేదు కానీ.. పాపవి మాత్రం వద్దంటూ కోరారు. బుధవారం ముంబైలోని ఫొటో జర్నలిస్టులకు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ నోట్ పంపారు. ఇన్నేళ్లు మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. పాప పుట్టిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేం ఫోటో జర్నలిస్టులను కోరేది ఒక్కటేనని.. తమ బిడ్డ ప్రైవసీని కాపాడాలని అనుకుంటూ ఉన్నామని అన్నారు.

ఈ విషయంలో మీ మద్దతు, మీ సాయం మాకు కావాలని.. దయచేసి మా బిడ్డకు సంబంధించి ఏ ఫొటోనూ ప్రచురించొద్దని కోరారు. కావాలంటే మాకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వేసుకోండి కానీ తమ కుమార్తె ఫోటోలను తీయకండని కోరారు. మేం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నామో అర్థం చేసుకుంటారని.. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఫొటో జర్నలిస్టులను కోరింది ఈ జంట..! వీరి విజ్ఞప్తిని మీడియా మన్నిస్తుందో లేక ఎప్పటి లాగే కెమెరాలు వారిని చుట్టుముడతాయో కాలమే నిర్ణయిస్తుంది. విరాట్-అనుష్క దంపతుల బిడ్డ ఎలా ఉందో అనే కుతూహలం చాలా మందిని వెంటాడుతూ ఉంది. 

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

   6 hours ago


ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

   7 hours ago


పాండ్యా సోదరులకు పితృ వియోగం

పాండ్యా సోదరులకు పితృ వియోగం

   14 hours ago


భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

   15-01-2021


బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

   15-01-2021


భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

   15-01-2021


ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

   14-01-2021


క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

   14-01-2021


అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

   13-01-2021


ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle