వెంటాడుతున్న గాయాలు.. మరో ఇద్దరు ఆటగాళ్లు సిరీస్ నుండి అవుట్
12-01-202112-01-2021 11:08:49 IST
2021-01-12T05:38:49.272Z12-01-2021 2021-01-12T05:38:44.757Z - - 17-01-2021

భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ లో ఇప్పటికే పలువురు స్టార్స్ గాయాల బారిన పడి సిరీస్ కు దూరమవ్వగా.. మరో ఇద్దరు ఆటగాళ్లు మూడో టెస్ట్ తర్వాత భారతజట్టును వీడనున్నారు. చేతి వేలికి గాయం కారణంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగో టెస్టుకు దూరమవ్వగా.. నాలుగో టెస్టులో హనుమ విహారి కూడా ఆడడం లేదు. తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో ఈనెల 15 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో హనుమ విహారి ఆడడం కష్టమే. సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఆటలో హనుమ విహారి, అశ్విన్ పూర్తిగా డిఫెన్స్ ఆడి మ్యాచ్ ను డ్రాగా ముగిసేలా చేయడం చాలా స్పెషల్. ఆ సమయంలోనే అతనికి గాయమైంది. టెస్టు ముగిశాక హనుమ విహారికి స్కానింగ్ చేసి, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇంగ్లండ్‌తో త్వరలో జరిగే సిరీస్‌కూ అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
హనుమ విహారి మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎంతో మంది విహారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. 407 పరుగుల ఛేదనలో టీమిండియా 250/4తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (23 నాటౌట్: 161 బంతుల్లో 4x4) చివరి వరకూ సహనంతో బ్యాటింగ్ చేశాడు. తొడ కండరాల గాయం వేధించినా, ఆస్ట్రేలియా ఫీల్డర్లు పదే పదే స్లెడ్జింగ్ కూడా చేశారు. అశ్విన్ (39 నాటౌట్: 128 బంతుల్లో 7x4)తో కలిసి దాదాపు మూడు గంటలకిపైగా క్రీజులో నిలిచిన హనుమ విహారి గొప్ప పోరాటాన్ని చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 38 బంతులాడిన హనుమ విహారి లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ 4 పరుగుల వద్ద రనౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అతడు అద్భుతమైన డిఫెన్స్ చూపించాడు. ఒకవేళ హనుమ విహారి కాస్త దూకుడుగా ఆడి ఔటై ఉండింటే..? ఆ తర్వాత మిగిలిన నాలుగు వికెట్లని తీయడం ఆస్ట్రేలియా బౌలర్లకి పెద్ద కష్టం కాకపోవచ్చని పలువురు నమ్మారు. జడేజా బొటనవేలికి గాయం కావడంతో అతన్ని ఆసీస్ బౌలర్లు అవుట్ చేయొచ్చు అని భావించారు. ఆ తర్వాత బుమ్రా, సిరాజ్, సైనీలను ఆసీస్ పేస్ అటాక్ వీలైనంత తొందరగా అవుట్ చేసేస్తుంది. కాబట్టి విహారి, అశ్విన్ ఆడిన ఆట టెస్ట్ మ్యాచ్ లలో ఉన్న మజాను మనకు చూపిస్తుంది. విహారి ఇన్నింగ్స్ సెంచరీకి ఏ మాత్రం తక్కువ కాదని పలువురు క్రికెట్ లెజెండ్స్ అభిప్రాయపడ్డారు.

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్
8 hours ago

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
9 hours ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
16 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021
ఇంకా