newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

14-04-202114-04-2021 20:02:42 IST
2021-04-14T14:32:42.714Z14-04-2021 2021-04-14T14:32:23.526Z - - 15-05-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ : టోక్యోలో జరుగబోయే ఒలింపిక్స్ లో భారత తన పతకాల వేటను మరింతగా కొనసాగిస్తుందని ఈ సారి రెండంకెల సంఖ్యకు ఒలింపిక్స్ పతకాలు భారత్ కైవసం అవుతాయన్న ఆశాభావాన్ని క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్ తమ సత్తాను చాటుకునేందుకు, అందుకు సన్నద్ధమయ్యేందుకు అథ్లెట్లు అందరికీ అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సారి భారత్ కు అద్వితీయ రీతిలో మెడల్స్ సంపాదించి చిరస్మరణీయ క్షణాలను ఆవిష్కరించాల్సిన గురుతర బాధ్యత అథ్లెట్ల పై ఉందని అన్నారు.

" టోక్యో ఒలింపిక్స్ చిరస్మరణీయం కావాలన్నది భారతీయుల ఆకాంక్ష. అందుకు అవసరమైన సత్తాను చాటి మెడల్స్ ను తీసుకురావలసిన బాధ్యత అథ్లెట్లపై ఉంది. భారత దేశానికి సంబంధించినంత వరకు టోక్యో  ఒలింపిక్స్ ఒక మైలు  రాయి కావాలని ఆశిస్తున్నాం. అందుకు రెండంకెల సంఖ్యలో పతకాలను సాధించడమే అథ్లెట్లు లక్ష్యంగా పెట్టుకోవాలి. " క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించినంతవరకు ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్లందరికీ అన్ని రకాలు గాను శిక్షణతో పాటు ఇతర వెసులుబాట్లను కల్పించామని ఆయన తెలిపారు. 

టోక్యో ఒలింపిక్స్ 100 రోజుల కౌంట్ డౌన్ సందర్భంగా జరిగిన చక్షుష వెబినార్ లో మాట్లాడిన ఆయన "టోక్యో క్రీడల్లో భారత్ తరపున పాల్గొంటున్న క్రీడాకారులకు ఏ రకమైన కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. అయితే కొత్త రికార్డును ఈ క్రీడల్లో సృష్టించాల్సిన బాధ్యత క్రీడాకారులపై ఉంది.   ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ సాధించే పతకాలు రెండంకెల సంఖ్యకు తగ్గకూడదు" అని అన్నారు. " మీ కోసం  మేము అన్నీ చేశాము. మీరు చేయాల్సిందల్లా భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలు తీసుకురావడమే. మీరు ఏమి కోరుకుంటే అది మేము ఇస్తాము కానీ పతకాల వేటలో మీ ప్రయత్న లోపం ఉండకూడదు" అని రిజ్ జూ తన సందేశంలో  అథ్లెట్లకు సందేశం ఇచ్చారు. 

ఇప్పటికే ఈ క్రీడలకు అర్హత సంపాదించిన అథ్లెట్లు కోవిడ్  వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న 100 రోజుల్లో ప్రతి రోజూ కీలకమేనని ఒలింపిక్స్ ప్రారంభమయ్యే జూలై 23 నాటికి అథ్లెట్లు సర్వ సన్నద్ధం కావాలని ఆయన తెలిపారు. ఇకనుంచి ప్రతీది కూడా అథ్లెట్ల ప్రణాళిక వారి కోచ్ ల కార్యక్రమం పైన ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసిన ఆయన "ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఏ అథ్లెట్ కైనా కోవిడ్  పాజిటివ్ వస్తే దాని ప్రభావం మొత్తం జట్టుపై ఉంటుంది.

అందుకే క్రీడా అథారిటీ అలాగే జాతీయ క్రీడల సమాఖ్యల నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి" అని అన్నారు. ఒలింపిక్ క్రీడలకు సంబంధించి భారత్ మరింత పెద్ద భూమికను పోషించాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ఇందుకు ఏకైక మార్గం పెద్ద సంఖ్యలో పతకాలను రాబట్టుకోవడమేనని తెలిపారు. నిజానికి భారత్ సుదీర్ఘమైన చరిత్ర ఉందని, పెద్ద దేశమైన భారత్ ఒలింపిక్స్ ఉద్యమంలో మరింత కీలకమైన, విస్తృతమైన పాత్రను పోషించాలని అన్నారు.  

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle