నాలుగో టెస్టు ముంబైలో అయినా ఆడతాం.. ఆసీస్ కెప్టెన్ స్పష్టం
07-01-202107-01-2021 12:14:18 IST
2021-01-07T06:44:18.433Z07-01-2021 2021-01-07T06:44:15.072Z - - 20-01-2021

దీర్ఘకాలం బయో బబుల్‌లో క్రీడాకారులు ఉండిపోవడం లోని సమస్య అర్థం చేసుకోదగినదే కానీ టీమిండియా ప్లేయర్ల వైఖరితో భారత్, ఆసీస్ జట్లమధ్య చివరి, నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అంశంపై కాస్త టెన్షన్ పడుతున్నామని ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు. అయితే మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశతో సంబంధం లేకుండా కేవలం ఆటపై దృష్టి సారించడం మాత్రమే తమ నైజమని టిమ్ పైన్ స్పష్టం చేసాడు. టీమిండియా అభ్యంతరాల నేపథ్యంలో నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జరిగినా, ముంబైలో జరిగినా ఆసీస్ జట్టుకు ఏమంత తేడా ఉండదని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రపంచంలో శక్తిమంతమైన బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న టిమ్ పైన్.. ప్రత్యర్థి జట్టు శిబిరం నుంచి వస్తున్న వార్తలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్నాయన్నాడు. చివరి టెస్టు వేదిక ఎక్కడన్న విషయం గురించి తాము ఆలోచించడం లేదని, ప్రస్తుతం జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించాడు. డిసెంబర్ 15 నుంచి బ్రిస్బేన్‌లో ఆసీస్- టీమిండియా మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉండటం తెలిసిందే. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు స్పష్టంగా చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కూడా కొంతమంది హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలో టిమ్ పైన్ మాట్లాడుతూ.. ప్రొటోకాల్ పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇరు జట్లు వరుస సిరీస్‌లతో బిజీ అయ్యాయి. టెస్టు క్రికెట్ ఆడుతున్నాయి. రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవే. అంతేకాదు పరస్పర గౌరవంతో ముందుకు సాగుతాయి. అయితే కొన్ని రోజులుగా అవతలి వైపు శిబిరం నుంచి వినిపిస్తున్న మాటలు చిరాకైతే తెప్పించడం లేదు గానీ.. కాస్త అసాధారణంగా అనిపిన్నాయి. ఏదేమైనా మూడో టెస్టుపైనే ప్రస్తుతం మేం దృష్టి సారించాం’’ అని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. సిడ్నీలో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో వర్షం వల్ల కాస్త అంతరాయం కలిగినా ఆసీస్ జట్టు భారత్ బౌలింగును ధీటుగా ఎదుర్కొంటోంది. 33 ఓవర్లు గడిచేసరికి ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. మహమ్మద్ సిరాజ్ బంతికి 5 పరుగులకే డేవిడ్ వార్నర్ ఔటయినా ఆరంగేట్రం చేసిన విల్ పకోవిస్కీ (60), లబుషేన్ (38) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. నాలుగో టెస్ట్ విషయంలో పెద్ద రచ్చే జరుగుతుందిగా..!

ఉద్వేగానికి లోనైన రవి శాస్త్రి.. అద్భుత విజయంపై రహానే ఏమన్నాడంటే
4 hours ago

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక
4 hours ago

టీమిండియా గెలుపు దేశానికి గర్వకారణం.. మోదీతో సహా దిగ్గజాల ప్రశంసలు
11 hours ago

యువ ఇండియా సాధించిన అద్భుత విజయం.. గవాస్కర్ వ్యాఖ్య
11 hours ago

బ్రిస్బేన్ టెస్ట్.. వర్షం వస్తుందా.. ఫలితం వస్తుందా..?
18-01-2021

భారత ఆటతీరుకు ఫిదా అవుతున్న క్రికెట్ లెజెండ్స్
17-01-2021

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్
16-01-2021

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
16-01-2021

పాండ్యా సోదరులకు పితృ వియోగం
16-01-2021

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021
ఇంకా