newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

13-01-202113-01-2021 15:49:56 IST
2021-01-13T10:19:56.547Z13-01-2021 2021-01-13T10:19:47.564Z - - 17-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిడ్నీ టెస్టులో టీమిండియాతో జరిగిన చివరి రోజు ఆటలో టీమిండియా స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు నిజంగానే సిగ్గుపడు తున్నానని ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌ విచారం వ్యక్తపరిచాడు.  ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ భారత్‌ బౌలర్‌ అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలపై క్రికెట్‌లో అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తన ప్రవర్తన పట్ల టిమ్ పైన్ క్షమాపణ చెప్పుకున్నాడు. భారత స్పిన్నర్‌ అశ్విన్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు.

మైదానంలో స్టంప్‌మైక్‌ ఉంటుందన్న విషయం తెలిసి కూడా దురదృష్టవశాత్తూ నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చాను. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆటలో జాగ్రత్తగా ఉండాలని నిన్న జరిగిన చర్యతో తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తాను.. అశ్విన్‌తో అలా ప్రవర్తించి ఉండకూడదు.. నా చర్యకు సిగ్గుపడుతున్నానని పైన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే రవిచంద్రన్ అశ్విన్‌తో తాను మాట్లాడానని, జరిగింది మర్చిపోయి ఇద్దరమూ హాయిగా నవ్వుకున్నామని పైన్ చెప్పాడు. నీతో గొడవ పెట్టుకుని మూర్ఖుడిలా వ్యవహరించాను అని అశ్విన్‌తో చెప్పానన్నాడు. టీమ్‌ను నేను నడిపిన తీరు ఎలా ఉన్నా సరే..మూడోటెస్టు చివరి రోజు నా ప్రవర్తనను నిజంగానే సమర్థించుకోలేనని పైన్ చెప్పాడు.

నా నాయకత్వ పటిమ సరిపోలేదు. మూడో టెస్టులో ఆట కలిగించిన ఒత్తిడి నాపై ప్రభావం చూపింది. నా మూడ్‌నే అది ప్రభావం కలిగించింది. అది నా ఆటతీరును దెబ్బతీసింది. నాయకుడిగా పేలవమైన ఆట ప్రదర్సించానని టీమ్ ప్లెయర్లతో కూడా చెప్పాను. నా టీమ్‌ను నేను సిగ్గుపడేలా చేశాను అని పైన్ చెప్పాడు.

సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కిన విషయం తెలిసిందే. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ నిలకడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు విసిగిపోయిన పైన్.. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. 

కాగా ఆటలో భాగంగా మూడోరోజు కూడా పైన్‌ పుజారా ఔట్‌ విషయంలోనూ ఫీల్డ్‌ అంపైర్‌ విల్సన్‌పై మండిపడిన విషయం తెలిసిందే. అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

   7 hours ago


ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

   8 hours ago


పాండ్యా సోదరులకు పితృ వియోగం

పాండ్యా సోదరులకు పితృ వియోగం

   15 hours ago


భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

   15-01-2021


బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

   15-01-2021


భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

   15-01-2021


ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

   14-01-2021


క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

   14-01-2021


మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

   13-01-2021


ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

   13-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle