newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

15-04-202115-04-2021 17:54:42 IST
Updated On 15-04-2021 12:22:10 ISTUpdated On 15-04-20212021-04-15T12:24:42.879Z15-04-2021 2021-04-15T06:29:26.060Z - 2021-04-15T06:52:10.413Z - 15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్‌లు థ్రిల్లర్ ముగింపుతో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్నాయి. మంగళవారం వరకు అయిదు మ్యాచ్‌లు పూర్తయితే అన్ని మ్యాచ్‌లు చివరి బంతివరకు టీవీ ప్రేక్షకులు కూడా మునివేళ్లతో తిలకించేటంత సస్పెన్స్‌తో ముగియడం ఒక విశేషం. అందులోనూ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 430 పరుగులు సాధించి ప్రేక్షకులను అలరించాయి. రెండు జట్లూ 24 సిక్సులు బాది టి20 మ్యాచ్‌లలో సిక్స్‌ల మజా ఎలా ఉంటుందో నిరూపించాయి. 

రాజస్థాన్ రాయల్స్ తరపున తొలిసారి కేప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజూ సామ్సన్ ఐపీఎల్ 2021లో తొలి సెంచరీ సాధించగా (119 పరుగులు), అతడి ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఅల్ రాహుల్ కూడా 91 పరుగులు సాధించి ప్రేక్షకులకు ఇళ్లలోనే సంతోషాన్ని, ఉద్వేగాన్ని పంచిపెట్టారు.

మరోవైపున ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన పోటీ ఇరుజట్ల అభిమానులను మునివేళ్లమీద నిలబడేలా చేసింది. ముంబై విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని దాదాపుగా కాపాడుకుంటున్నట్లే కనిపించి చివరలో చేతులెత్తేసింది. 

కాగా ఒక స్పెషల్ జంట ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మద్దతు తెలుపుతూ క్రికెట్ అభిమానులను సంతోషంతో ముంచెత్తుతోంది. గత సంవత్సరం ఆస్ట్రేలియాకు, టీమిండియాకు మధ్య ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన రెండో వన్డేలో ఒక భారతీయ ఫ్యాన్ తన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్‌కు స్టేడియంలోనే ప్రపోజ్ చేయడం ద్వారా సంచలనం సృష్టించాడు. మ్యాచ్ మధ్యలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది.

నవంబర్‌ నెలలో సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఫ్యాన్ ఒకరు తన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్‌కి మోకాళ్లమీద నిలబడి రింగ్ ఇచ్చి మరీ, పెళ్లి చేసుకుందామా అని ప్రపోజ్ చేశాడు. ఆమె సిగ్గుల మొలకై ముఖాన్ని చేతులతో కప్పుకుని తర్వాత అతడి ఆహ్వానాన్ని ఆమోదించింది. ఈ ఘటనను కెమెరాలు మొత్తంగా ఫోకస్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ఇరు జట్లమధ్య రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

రింగ్‌ బాక్స్‌లో నుంచి రింగ్‌‌ను తీసి అతడు ఆమెకు ప్రపోజ్‌ చేయడంతో ఉబ్బితబ్బైపోయిన ఆమె.. అతని ప్రేమను అంతే హుందాగా అంగీకరించింది. అటు తర్వాత ఇద్దరూ హగ్‌ చేసుకుని తమ ప్రేమను చాటుకున్నారు. తన బాయ్ ఫ్రండ్ ప్రపోజల్‌ను ఆమోదించిన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత అతగాడిని స్టేడియంలోనే ముద్దు పెట్టుకోగా స్టేడియంలోని ప్రేక్షకులు (ఆ వన్డే సీరీస్‌కు గాను ప్రేక్షకులను అనుమతించారు) హర్షధ్వానాలు చేశారు. 

దీన్ని గమనించిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కాబోయే ఆ దంపతులను అభినందిస్తూ మైదానంలోంచే చప్పట్లు కొట్టాడు. కామెంటేటర్లు కూడా ఆటను మరిచి కొన్న క్షణాల పాటు వీరిద్దరి ప్రపోజల్‌ పైనే వ్యాఖ్యానిస్తూ పోయారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఆడిన రెండో వన్డేలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కానీ ఆ ఓటమి కంటే వీరిద్దరి ప్రపోజల్ వ్యవహారమే మీడియాలో హైలెట్ కావడం విశేషం.

భారతీయ యువకుడు ఆమెకు ప్రపోజ్ చేసినప్పుడు ఆమె ముందుగా నో చెప్పిందని స్టంప్ కెమెరాలో రికార్డయిందట. తర్వాత కాస్సేపటికి ఆమె సిగ్గుపడుతూనే యస్ చెప్పిందని తాజా వార్త. 

the Indian- Australian couple during the India-Australia second ODI (Photo- Twitter)

కట్ చేస్తే దృశ్యం మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈ దంపతులకు సంబంధించిన మరొక వీడియో రంగంలోకి వచ్చింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మద్దతిస్తూ ఆ దంపతులే సంతోషం వ్యక్తం చేస్తున్న వీడియో అది. పైగా ఆ ఇద్దరూ ఆర్సీబీ జెర్సీని కూడా వేసుకుని ఉన్నారు. ఐపీఎల్ 14 సీజన్‌లో ఈ ఖండాంతర జంట స్పష్టంగా విరాట్ కోహ్లీ అండ్ కో పక్షం నిలిచారు. 

గత సంవత్సరం వారిద్దరూ తమ తమ జట్లకు మద్దతిస్తే, ఈ ఐపీఎల్‌  సీజన్‌ ఆరంభమైన తర్వాత వారిద్దరూ కలిసి ఒకే జట్టుకు మద్దతిస్తున్నారు .అప్పుడు వారిద్దరూ తమ తమ దేశాలకు విడివిడిగా మద్దతిచ్చి ఒక్కటైతే, ఇప్పుడు వారు ఒక్కటిగా ఆర్సీబీని తన ఫేవరెట్‌ టీమ్‌గా ఎంచుకున్నారు. పైగా ఆ జంట ఇప్పుడు ఆర్సీబీకి అభిమానులైపోయారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత సంవత్సరం ఆ ప్రేమజంట స్టేడియంలోనే ప్రపోజ్ చేసుకుని ఆనందంతో తబ్బిబ్బవుతున్న సందర్బంగా వారిద్దరినీ చప్పట్లతో అభినందించిన ఆసీస్ జట్టు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ యాధృచ్చికంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడటమే.. కోహ్లీ కోరి మరీ రప్పించుకున్న మాక్స్ వెల్ కీలకక్షణంలో ఆటను మలుపు తిప్పి జట్టుకు విజయం సాధించి పెట్టిన విషయం తెలిసిందే.

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle